Liquor bottles: వీళ్ల పైత్యం మామూలుగా లేదుగా.. వధూవరులకు బహుమతిగా మద్యం బాటిళ్లు

ABN , First Publish Date - 2023-05-27T10:22:09+05:30 IST

స్నేహితుల వివాహంలో పాల్గొన్న మిత్రులు వధూవరులకు బహుమతిగా మద్యం బాటిళ్లు అందజేసి శుభా కాంక్షలు తెలి

Liquor bottles: వీళ్ల పైత్యం మామూలుగా లేదుగా.. వధూవరులకు బహుమతిగా మద్యం బాటిళ్లు

ప్యారీస్‌(చెన్నై): స్నేహితుల వివాహంలో పాల్గొన్న మిత్రులు వధూవరులకు బహుమతిగా మద్యం బాటిళ్లు అందజేసి శుభా కాంక్షలు తెలిపారు. కళ్లకుర్చి ఎం ఫోర్‌ ప్రాంతానికి చెందిన చేపల వ్యాపారి మణికంఠన్‌(Manikanthan) విరుదావూరు ప్రాంతానికి చెందిన దివ్య వివాహం కళ్లకుర్చి శివాలయంలో ఘనంగా జరిగింది. అనంతరం ఓ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో మణికంఠన్‌ మిత్రులు నగదు, నగలు, ఇతర బహుమతులకు బదులుగా అధిక ధరకు పలికే విదేశీ మద్యం బాటిళ్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం, సారాకు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, నూతన దంపతులకు బహుమతిగా ఫారిన్‌ లిక్కర్‌ అందజేయడం మంచి సంస్కృతి కాదని పెద్దలు వాపోతున్నారు.

Updated Date - 2023-05-27T10:22:09+05:30 IST