Life Style:అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన టాప్ 10 దేశాలివే
ABN , First Publish Date - 2023-09-19T19:42:49+05:30 IST
యూఎస్ న్యూస్, వరల్డ్ రిపోర్ట్ ప్రకారం.. అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన టాప్ 10 దేశాలు స్వీడన్ , నార్వే , కెనడా, డెన్మార్క్ , ఫిన్లాండ్ , స్విట్జర్లాండ్ , నెదర్లాండ్స్ , ఆస్ట్రేలియా , జర్మనీ, న్యూజిలాండ్.
మంచి లైఫ్ స్టైల్(Life Style) కావాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ లైఫ్ స్టైల్ అనే పదమే వేర్వేరు ఫ్యాక్టర్స్ పై మారుతూ ఉంటుంది. ఓ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తికి విద్య(Education), ఉపాధి, ఆరోగ్యం(Health), మౌలిక సదుపాయాలు, వ్యక్తిగత అవసరాలు తదితర అంశాలన్నీ లైఫ్ స్టైల్ ని ప్రభావితం చేసేవే. వీటితో పాటు లా అండ్ ఆర్డర్(Law and Order), ఆర్థిక, రాజకీయ స్థిరత్వం తదితర అంశాలూ పరిగణలోకి వస్తాయి. వీటన్నింటిని ఆధారంగా చేసుకుని జీవన నాణ్యత ఆధారపడి ఉంటుంది. మరి ప్రపంచంలోని అన్ని దేశాలు అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగి ఉన్నాయా అంటే కాదనే అంటున్నారు నిపుణులు. యూఎస్ న్యూస్, వరల్డ్ రిపోర్ట్ ప్రకారం.. అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన టాప్ 10 దేశాలు స్వీడన్ , నార్వే , కెనడా, డెన్మార్క్ , ఫిన్లాండ్ , స్విట్జర్లాండ్ , నెదర్లాండ్స్ , ఆస్ట్రేలియా , జర్మనీ, న్యూజిలాండ్. ఉద్యోగాలు, ఆర్థికంగా స్థిరత్వం, కుటుంబ అనుకూలతలు, ఆదాయాలు, రాజకీయ స్థిరత్వం, ప్రజారోగ్య వ్యవస్థ, విద్యా వ్యవస్థ ప్రాతిపాదికన ఈ దేశాలను ఎంపిక చేశారు.
స్వీడన్ అగ్రస్థానంలో..
జీవన నాణ్యతలో ప్రపంచంలోని అత్యుత్తమ దేశాలలో స్వీడన్ అగ్రస్థానంలో ఉంది. ఇందుకు కారణాలూ లేకపోలేదు. ఆ దేశంలో ఫ్రీ గా వైద్యం, విద్యను అందజేస్తున్నారు. దీనికి తోడు ది బెస్ట్ పేరెంటల్ లీవ్ పాలసీ కూడా ఉంది. పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు 16 నెలల సెలవులకు అర్హులు.
నార్వేలో...
జీవన నాణ్యత కోసం ప్రపంచంలోని టాప్ 10 అత్యుత్తమ దేశాల జాబితాలో నార్వే రెండో స్థానంలో ఉంది. ఈ దేశంలో పుట్టిన వారి ఆయుర్దాయం 82 ఏళ్లు. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం, ప్రపంచంలోని మొదటి 10 సంతోషకరమైన దేశాలలో నార్వే ఒకటి.
కెనడాలో...
కెనడా ఆర్థిక స్థోమత, విద్య, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తదితర అంశాలలో బాగా స్కోర్ చేసింది. కెనడాలో సగటు మనిషి ఆయుర్దాయం 84 ఏళ్లు. బెటర్ లైఫ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం.. దేశంలో మంచి ఆదాయం వచ్చే ఉద్యోగాలు, ఉపాధి, ప్రకృతి ఆకట్టుకుంటుంది.