Long Hair: పొడవాటి జుట్టు కావాలా? ఈ ఆకును మూడురకాలుగా వాడితే చాలు.. ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు..
ABN , First Publish Date - 2023-07-10T09:51:13+05:30 IST
ఈ ఆకును మూడురకాలుగా వినియోగిస్తే చాలు జుట్టు పెరుగుదలలో అద్భుతం కనిపిస్తుంది.
పొడవైన జుట్టు కావాలని కోరుకోని మహిళలు అరుదుగా ఉంటారు. జుట్టు పెరిగిన తరువాత కత్తిరించుకున్నా పెద్దగా బాధపడరు కానీ, జుట్టు ఆరోగ్యంగా పెరగకపోతే మాత్రం ఆందోళన చెందుతారు. జుట్టు ఒత్తుగా పెరగడం కోసం ఎన్నెన్నో హెయిర్ ప్యాక్ లు, సీరమ్ లు, షాంపూలు, హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు. అయితే ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి, పైగా ఫలితాలు కూడా డౌటే.. వీటన్నింటికి సులువైన పరిష్కారం ఉందిప్పుడు. ఈ ఒక్క ఆకును మూడురకాలుగా వినియోగిస్తే చాలు జుట్టు పెరుగుదలలో అద్భుతం కనిపిస్తుంది. ఇంతకూ ఈ ఆకేంటి, దాన్ని ఎలా ఉపయోగించాలి? పూర్తీగా తెలుసుకుంటే..
అందరికీ ములక్కాడల గురించి తెలుసు, వీటితో ఎన్నో రకాల కూరలు చేసుకుంటాం కూడా. కానీ మునగ ఆకును(moringa leaves)వినియోగించేవారు తక్కువ. కానీ మునగ ఆకు వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీన్ని మిరాకిల్ ట్రీ(miracle tree) అని పిలుస్తారు. నారింజ కంటే 7రెట్లు విటమిన్ సి(vitamin c), పాలకంటే 4రెట్ల కాల్షియం(calcium), క్యారెట్ కంటే 4రెట్లు ఎక్కువ కెరోటిన్(keratin) మునగాకులో ఉంటుంది. ఈ కారణంగా ఇది జుట్టు పెరుగుదలలో మ్యాజిక్ చేస్తుంది. దీన్ని మూడు రకాలుగా వినియోగించాలి.
Viral Video: ఈ చిరుత ఇంత తెలివితక్కువదేంటీ.. సులువుగా అడవి పందినైతే పట్టుకుంది కానీ.. ఆ తరువాత అది చేసిన పనికి..
హెయిర్ మాస్క్..(Hair mask)
మునగాకును మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇందులో ఒక స్పూన్ కొబ్బరినూనె(coconut oil) కలిపి బాగా మిక్స్ చేయాలి.దీన్ని తలకు మాస్క్ లాగా అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 30నిమిషాల తరువాత శుభ్రమైన నీటితో జుట్టు కడిగేయాలి. ఈ మాస్క్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, చుండ్రు, తలలో పుండ్లు తగ్గిపోతాయి.
టీ..(Tea)
జుట్టు పెరుగుదలకు మునగాకు టీ(moringa tea) మ్యాజిక్ ఫలితాలు ఇస్తుంది. గుప్పెడు తాజా ఆకులు లేదా అరస్పూన్ మునగాకు పొడిని గ్లాసుడు నీళ్లలో వేసి మరిగించాలి, ఆ తరువాత ఫిల్టర్ చేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నీటిని టీ లాగా తాగవచ్చు, ఇదే నీటిని తలస్నానం తరువాత జుట్టు కడగడానికి వినియోగించవచ్చు. ఇది జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది. కుదుళ్ళ నుండి మందం పాటి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
హెయిర్ ఆయిల్..
మునగాకు నూనె జుట్టు కండీషన్ ను మెరుగుపరుస్తుంది. మునగాకును ఎండబెట్టి పొడి చేసుకోవాలి. మందంపాటి గిన్నెలో రెండు స్పూన్ల పొడిని, కప్పుడు కొబ్బరినూనెలో వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని సన్నని మంట మీద పొడి మొత్తం బాగా ఉడికి కొబ్బరినూనె పైకి తేలే వరకు ఉడికించాలి. దీన్ని ఫిల్టర్ చేసి గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ నూనెను రాత్రి సమయంలో కొద్దికొద్దిగా జుట్టు కుదుళ్ళనుండి తలంతా మసాజ్ చేసి రాత్రంతా అలాగే వదిలేయాలి. మరుసటిరోజు ఉదయాన్నే గాఢత లేని షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే జుట్టు నల్లగా తుమ్మెద రెక్కల్లా మెరుస్తుంది.
Viral Video: 200నోటుతో మ్యాజిక్ చేసిన వృద్దుడు.. తేనె పోసి అగ్గిపుల్లతో వెలిగించాడు.. ఆ తరువాత జరిగిందేంటో చూస్తే..