Lottery Grand Prize: రూ.44 కోట్లు గెలిచారని ఫోన్ చేస్తే.. సైబర్ నేరగాళ్లేమో అని నెంబర్‌ను బ్లాక్ చేశాడు.. నిజమేనని ఆలస్యంగా తెలిసి..!

ABN , First Publish Date - 2023-04-06T21:28:01+05:30 IST

మీరు డబ్బు గెలిచారంటూ ఎన్నో సందేశాలు వస్తుంటాయి. అవన్నీ ఫేక్ అని వాటికి కక్కుర్తి పడితే మనతో ఉన్నది కూడా ఊడుతుందని నెంబర్లు మెయిల్స్ బ్లాక్ చేస్తుంటాం.. అతనూ అలాగే..

Lottery Grand Prize: రూ.44 కోట్లు గెలిచారని ఫోన్ చేస్తే.. సైబర్ నేరగాళ్లేమో అని నెంబర్‌ను బ్లాక్ చేశాడు.. నిజమేనని ఆలస్యంగా తెలిసి..!

'మీరు పది కోట్ల ప్రైజ్ మనీ గెలిచారు.. డబ్బు క్లెయిమ్ చేసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి' అంటూ మొబైల్ ఫోన్ లకు, ఇ-మెయిల్ కు బోలెడు సందేశాలు వస్తుంటాయి. అవన్నీ ఫేక్ అని, వాటికోసం కక్కుర్తి పడితే మనదగ్గరున్నది కూడా ఊడుతుందని చాలామంది తెలుసుకున్నారు. ఈ కారణంగానే అలాంటి మెసేజ్ లకు, మెయిల్స్ కు రిప్లయ్ ఇవ్వకుండా ఆ నెంబర్లు బ్లాక్ చేసేస్తారు. ఓ వ్యక్తికి 'మీరు 44కోట్లు గెలిచారు' అంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. 'సైబర్ నేరగాళ్ళేమో.. ఫోన్ మాట్లాడుతుండగానే బ్యాంక్ అకౌంట్ ట్రాప్ చేసి నా డబ్బంతా నొక్కేస్తారు, వీళ్ళతో మాటలేంటి' అని అనుకున్నాడు అతను. వెంటనే కాల్ కట్ చేసి, నెంబర్ బ్లాక్ చేశాడు. కానీ ఆ తరువాత అది ఫేక్ కాదని నిజమని తెలిసి అవాక్కయ్యాడు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

కర్నాటక(Karnataka) రాజధాని బెంగళూరు‌కు(Bangalore) చెందిన అరుణ్ కుమార్ వటాకీ కోరోత్ (Arun Kumar Vatakke Koroth) అనే వ్యక్తి అబుదాబీ బిగ్ టికెట్ (abu dhabi big ticket) గురించి తన స్నేహితుడి ద్వారా తెలుసుకున్నాడు. అతను తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని వెబ్లైట్లో మార్చి 22వ తేదీన లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఈ టికెట్ లు ఒకటి కొంటె ఒకటి ఉచితం ఆఫర్ ఉండటంతో అరుణ్ కు రెండు టికెట్ లు వచ్చాయి. ఇతనికి ఉచితంగా వచ్చిన టికెట్ కు లాటరీ తగిలింది. సిరీస్ నం. 250, టికెట్ నం. 261031కు తాజాగా నిర్వహించిన డ్రాలో జాక్‌పాట్ (Jackpot) తగిలింది. ఇందులో అరుణ్ 20 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు. దీని విలువ భారతీయ కరెన్సీలో అక్షరాలా 44కోట్లా 71లక్షలు(44.71crores). అయితే ఈ విషయాన్ని అతనికి తెలియజేసేందుకు షో హోస్ట్ రిచర్డ్(Show host richard) అరుణ్ కు ఫోన్ చేశారు. కానీ ఏ సైబర్ నేరగాళ్ళో(cyber criminals) తనని ట్రాప్ చేయడానికి ఇలాంటి పని చేస్తున్నారనే కారణంతో అతను ఫోన్ కాల్ కట్ చేసి ఆ నెంబర్ బ్లాక్ చేశాడు.

Read also: Fridge: ఫ్రిడ్జ్ డోర్లను ఓపెన్ చేసి ఉంచితే జరిగేదేంటి..? నిజంగా గది అంతా చల్లగా అయిపోతుందా..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివి..!


అరుణ్ కాల్ కట్ చేసి, నెంబర్ బ్లాక్ చేసిన తరువాత షో హోస్ట్ రిచర్డ్ మళ్ళీ ఇంకొక నెంబర్ నుండి అరుణ్ ను కాంటాక్ట్ అయ్యి విషయం మొత్తం వివరించాడు. చాలాసేపు తను విన్నది నిజమేనా కాదా అనే సందిగ్దంలో ఉండిపోయాడు అతను . తనకు ఫ్రీగా వచ్చిన టికెట్ కు లాటరీ తగలడం చాలా షాకింగ్ గా ఉందని పేర్కొన్నాడు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఇతని అదృష్టం మామూలుగా లేదని అంటున్నారు.

Read also: Sugarcane Juice: ఎండాకాలం చెరకు రసం మంచిదే.. కానీ తయారు చేసిన 20 నిమిషాల తర్వాత తాగితే జరిగేది ఇదే..!

Poonam Bajwa: ‘సన్ సెట్‌’లో సెగలు పుట్టిస్తున్న పూనమ్ బాజ్వా.. వైరల్ అవుతున్న ఫొటోలు!


Mahesh Babu: ఓ.. అన్నా.. ఏంటీ ఈ అందం.. సూపర్ స్టార్ స్వయంగా షేర్ చేసిన ఫొటోలు.. ఫ్యాన్స్‌ ఫిదా..!

Updated Date - 2023-04-07T11:22:48+05:30 IST