Love Story: అతడికి 60 ఏళ్లు.. ఆమెకు 56 ఏళ్లు.. ఈ వయసులో ప్రేమ పెళ్లేంటని డౌటా..? అసలు వీళ్ల లవ్ స్టోరీ ఏంటో తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-05-18T19:56:32+05:30 IST
ప్రేమించుకున్న ప్రతి జంటా పెళ్ళిపీటలెక్కుతుందనే గ్యారెంటీ లేదు. కానీ 60ఏళ్ళ తాతగారు, 56ఏళ్ళ బామ్మ పెళ్ళిపీటలెక్కబోతున్నారు. వీరిది ప్రేమ వివాహమట. ఈ వయసులో ప్రేమ వివాహం ఏంటని ఆరా తీస్తే వీరి వయసే కాదు వీరి ప్రేమ కథ కూడా పే..ద్దదేనని తెలిసింది.
ప్రేమ గురించి చెప్పడానికి హిస్టరీ నుండి సినిమా ఇండస్ట్రీ వరకు బోలెడు కథలున్నాయి. ప్రేమించుకున్న ప్రతి జంటా పెళ్ళిపీటలెక్కుతుందనే గ్యారెంటీ లేదు. కానీ 60ఏళ్ళ తాతగారు, 56ఏళ్ళ బామ్మ పెళ్ళిపీటలెక్కబోతున్నారు. వీరిది ప్రేమ వివాహమట. ఈ వయసులో ప్రేమ వివాహం ఏంటని ఆరా తీస్తే వీరి వయసే కాదు వీరి ప్రేమ కథ కూడా పే..ద్దదేనని తెలిసింది. అసలు వీళ్ళ ప్రేమ కథ ఏంటి? ఈ వయసులో పెళ్ళి చేసుకోవడం ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..
'ప్రేమంటే సులువు కాదురా.. అదినీవు గెలవలేవురా' అనే పాట పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ఖుషీ(Pawan Kalyan Kushi Movie song)లో వినే ఉంటారు. ఇన్ని రోజులు ఆ మొదటి వాక్యాలు ఈ 60ఏళ్ళ తాతగారికి సరిపోయాయేమో అనిపిస్తుంది. 60ఏళ్ళ గ్రాహం అనే తాతగారు, 56ఏళ్ళ ఆండ్రియా అనే బామ్మ దాదాపు 28ఏళ్ళ కిందటే అంటే వారు వయసులో ఉన్నప్పుడే ఒకరికొకరు తెలుసు. గ్రాహం వయసులో ఉన్నప్పుడు ఆండ్రియాను ఇష్టపడ్డాడు. ఆమెకు ప్రపోజ్ చేయాలని ఉంగరం(ring) కూడా కొన్నాడు. అతను ఆండ్రియాకు ప్రపోజ్ చేయగా ఆమె అతని ప్రేమను తిరస్కరించింది(rejected his proposal). ఆమె దృష్టిలో ప్రేమ, పెళ్ళి అంత ముఖ్యమైనవిగా అనిపించలేదట. దీంతో అతను తన ప్రేయసి కోసం కొన్న ఉంగరాన్ని తనతో అలాగే ఉంచుకున్నాడు. వేరేవాళ్లైతే 'పోతే పోయింది మరొకరు దొరుకుతారులే' అని వేరే అమ్మాయిని చూసుకుని చక్కగా పెళ్ళి చేసుకుని సెటిల్ అయిపోయేవాళ్లేమో.. కానీ గ్రాహం మాత్రం వేరే అమ్మాయి వైపు కన్నెత్తి చూడలేదు. పైపెచ్చు ఆమె కోసం 28ఏళ్ళనుండి వెయిట్ చేస్తూనే ఉన్నాడు.
Table Fan Cooler: ఎండలకు తట్టుకోలేక వెరైటీ ప్లాన్.. టేబుల్ ఫ్యాన్‌ను సింపుల్ ట్రిక్స్‌తో కూలర్‌గా మార్చేశాడు..!
అన్నేళ్ళ అతని నిరీక్షణకు ఆ దేవుడే కరిగిపోయి ఆండ్రియా మనసు మార్చేసినట్టున్నాడు. గ్రాహం రీసెంట్ గా ఆండ్రియాను కలిసి చాలా రొమాంటిక్ గా ఆమెకు ప్రపోజ్ చేశాడు. అతనెప్పుడు ప్రపోజ్ చేసినా తోసిపుచ్చే ఆమె ఈసారి మాత్రం అతనికి నో చెప్పలేకపోయింది. అతని ప్రేమకు ఓకే చెబుతూ గ్రాహం ఇచ్చిన ఉంగరాన్ని స్వీకరించింది. దీంతో గ్రాహం ప్రపంచాన్ని జయించినంత సంతోషంలో మునిగిపోయాడు. ప్రస్తుతం గ్రాహం, ఆండ్రియా ఇద్దరూ పెళ్ళిపీటలెక్కే హడావిడిలో ఉన్నారు. కాగా ఆండ్రియాకు 88ఏళ్ళ వయసు గల తండ్రి ఉన్నాడు. ఆయన్ను కలసి, ఆయన అనుమతితోనే గ్రాహం ఆమెకు ప్రపోజ్ చేసినట్టు తెలిసింది. అపరిచితుడు సినిమాలో సదాకు లవ్ లెటర్ ఇవ్వడానికి విక్రమ్ మొదట ఆమె తల్లిదండ్రులను సంప్రదిస్తాడు. సినిమాలో ఆ సీన్ చూసి 'ఇలాంటి అమాయకులుంటారా?' అని బుగ్గలు నొక్కుకున్నారు ప్రేక్షకులు. కానీ గ్రాహం లవ్ స్టోరీలోనూ అలాగే జరిగిందని తెలిసి అవాక్కవుతున్నారు. ఏది ఏమైనా ఇన్నేళ్ళ ప్రేమ ఇలా ఫలించినందుకు అందరూ సంతోషంలో మునిగిపోయారు.