Home » Old age
జిల్లాలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణాన్ని తలపించింది. పెంచిన పింఛన అందుకున్న లబ్ధిదారుల ఇళ్లలో జయహో చంద్రన్న నినాదం మార్మోగింది. చంద్రబాబు పేదింటి పెద్ద కొడుకయ్యాడంటూ లబ్ధిదారుల నుంచి దీవెనలు వెల్లువెత్తాయి. చేతిలోకి ఒక్కసారిగా పింఛన రూపంలో రూ. ఏడు వేలు రాగానే అవ్వతాతల మోములు మతాబుళ్లా వెలిగిపోయాయి. కొందరు ఆనందంతో డ్యాన్సులు వేశారు. కొన్ని చోట్ల కేకులు కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ..
సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ అధినేతగా చంద్రబాబునాయుడు ఇచ్చిన పింఛన సొమ్ము పెంపు హామీ సోమవారం నెరవేరనుంది. పెంచిన పింఛన్ల సొమ్ము పంపిణీ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇంటి ముంగిటకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల సొమ్ముతోపాటు ఏప్రిల్, మే, జూన మాసాలకు సంబంధించి రూ.1000 చొప్పున కలిపి మొత్తం రూ.ఏడు వేలు అవ్వాతాతలకు ఇవ్వనున్నారు. పెంచిన పింఛన్ల ...
విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పెన్షన్ల పంపిణీకి అదికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సచివాలయాల వారీగా నగదు డ్రా చేసి సోమవారం కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 1న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొననున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాకలో ఉదయం 6 గంటలకు ......
పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. ఇప్పటివరకు అందుతున్న రూ.3 వేలకు అదనంగా పెంచిన రూ. వెయ్యి.. గత మూడు నెలల బకాయి రూ. 3 వేలు.. మొత్తం రూ.7 వేల సొమ్ము! నిజంగానే ప్రతి లబ్ధిదారుకూ ఇది పండగే.
జిల్లావ్యాప్తంగా 12 వేల క్లస్టర్లలో పింఛన పంపిణీ మ్యాపింగ్ పూర్తి చేశామని, ఒకటో తేదీన ఇంటి వద్దనే లబ్ధిదారులకు సొమ్ము అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని డీఆర్డీఏ-వైకేపీ పీడీ ఈశ్వరయ్య తెలిపారు. తన చాంబర్లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు పింఛన పెంచారని, పెంచిన పింఛనతో పాటు మూడు నెలల (ఏప్రిల్, మే, జూన) బాకియి మొత్తాన్ని ఒకటో తేదీన ఇంటివద్దనే అందజేస్తామని తెలిపారు. జూలై నెలకు 2,89,508 మంది లబ్ధిదారులకు రూ.197.44 కోట్లు మొత్తాన్ని జిల్లాకు ...
పెంచిన పింఛన్ల పంపిణీకి జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. పింఛన్లకు కేటాయించిన సొమ్మును శనివారం బ్యాంకుల నుంచి డ్రా చేస్తామని తెలిపారు. సీఎస్ నీరబ్ కుమార్ పింఛన్ల పంపిణీపై గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో 2,87,032 మంది లబ్ధిదారులకు జూలై నెలలో పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.195.70...
పింఛన పెంపు అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నెల నుంచే అమలు చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబునాయుడు... ఆ మేరకు ఆ హామీ అమలుపై దృష్టి సారించారు. ఏప్రిల్, మే, జూన నెలల బకాయిలతో పాటు జూలై నెలతో కలుపుకుని చెల్లించేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు పింఛన పెంచుతూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ జీఎం నంబరు 43 జారీ చేశారు. జూన నెలలో పంపిణీ చేసిన రూ.86.80 కోట్లతో ..
పింఛన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వృద్ధులకు శాపంగా మారింది. ఇంటింటికీ పంపిణీ చేసే వెసులుబాటు ఉన్నా.. ఈ నెల కూడా బ్యాంకుల్లోనే జమ చేశారు. దీంతో పింఛన సొమ్ము తీసుకునేందుకు శనివారం ఉదయం నుంచే బ్యాంకుల వద్ద మండుటెండలో పడిగాపులు కాశారు. బ్యాంకు ఖాతాల్లో సొమ్ము మధ్యాహ్నం నుంచి జమ చేయడం మొదలు పెట్టారు.
పింఛన్ల పంపిణీలో రాజకీయాన్ని వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన పంపిణీ చేసే వెసులుబాటు ఉన్నా.. బ్యాంకు ఖాతాలలో జమచేస్తామని చెప్పడం లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడమేనని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో సొమ్ము జమ అయిందో లేదో తెలుసుకోవడం, బ్యాంకు నుంచి నగదు వితడ్రా చేసుకోవడం దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బందికరం. ఎండలు మండిపోతున్న తరుణంగా బ్యాంకులకు వెళ్లడం వారికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. జిల్లా వ్యాప్తంగా 663 గ్రామ, వార్డు సచివాలయాలలో...