Share News

Viral Video: ఛీ..ఛీ.. మ్యాగీని ఇలా ఎవరైనా తింటారా? వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిపై నెటిజన్ల ఆగ్రహం..

ABN , First Publish Date - 2023-11-12T16:39:45+05:30 IST

కేవలం రెండు నిమిషాల్లో రెడీ అయిపోయే మ్యాగీని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. చాలా సులభంగా తయారు చేసుకోగల మ్యాగీని కేవలం నీటిలో మరిగించి, మసాలాలు వేసి తినెయ్యొచ్చు. మరికొందరు క్యారెట్‌తో పాటు పలు కూరగాయలు కూడా వేసి మ్యాగీ చేస్తారు. మరికొందరు మ్యాగీతో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.

Viral Video: ఛీ..ఛీ.. మ్యాగీని ఇలా ఎవరైనా తింటారా? వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిపై నెటిజన్ల ఆగ్రహం..

కేవలం రెండు నిమిషాల్లో రెడీ అయిపోయే మ్యాగీని (Maggi) చాలా మంది ఇష్టంగా తింటుంటారు. చాలా సులభంగా తయారు చేసుకోగల మ్యాగీని కేవలం నీటిలో మరిగించి, మసాలాలు వేసి తినెయ్యొచ్చు. మరికొందరు క్యారెట్‌తో పాటు పలు కూరగాయలు కూడా వేసి మ్యాగీ చేస్తారు. మరికొందరు మ్యాగీతో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఎలా చేసినా మ్యాగీని తినాలనిపిస్తుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో (Viral Video) మ్యాగీని తయారు చేసిన విధానం చూస్తే మాత్రం చిరాకు వేస్తుంది.

rajat.write అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో మ్యాగీని తయారు చేసిన విధానం చాలా షాకింగ్‌గా ఉంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ గిన్నెలో మ్యాగీని వేశారు. అనంతరం దానిపై చాక్లెట్ క్రీమ్ వేశారు (Chocolate maggi). తర్వాత పాలు వేశారు. పాలు, చాక్లెట్ క్రీమ్‌లో మ్యాగీని బాగా ఉడికించారు. ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి ``నేను ఇకపై మ్యాగీని తినడం మానెయ్యాలా`` అని కామెంట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (Food and Health).

Shocking Video: వామ్మో.. లిఫ్ట్ ఇలా కూడా ఎక్కుతారా? అప్పుడే బయటకు వచ్చిన యువతి ఎలా భయపడిందో చూడండి..

ఈ వైరల్ వీడియోపై మ్యాగీ ప్రియులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ``కేవలం సోషల్ మీడియా వ్యూస్ కోసమే ఈ వీడియో చేసి ఉంటారు``, ``ఈ మ్యాగీని తింటే కడుపు పాడైపోవడం ఖాయం``, ``ఇదెక్కడి పిచ్చి రా బాబూ``, ``బాబోయ్.. దీనిని ఎవరూ సీరియస్‌గా తీసుకోకూడదు``, ``ఇలాంటి వంటలు చేసే వారికి ఎవరైనా సహాయం చేయండి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-11-12T16:39:46+05:30 IST