వింత సంఘటన.. పరీక్షా కేంద్రంలోనే స్పృహ తప్పి పడిపోయిన ఇంటర్ విద్యార్థి.. అమ్మాయిలే అసలు కారణమట..!
ABN , First Publish Date - 2023-02-02T14:16:33+05:30 IST
ఇదో వింతైన సంఘటన. అది ఎగ్జామ్ సెంటర్. పరీక్ష రాసేందుకు విద్యార్థులంతా హాల్‌లోకి వచ్చారు. వచ్చి రాగానే ఓ స్టూడెంట్ (Male Student) కింద పడిపోయాడు. ఇంతకీ ఏమైందనే కదా మీ డౌట్. ఈ వార్త చదివాక నవ్వు ఆపుకోలేరు.
ఇదో వింతైన సంఘటన. అది ఎగ్జామ్ సెంటర్. పరీక్ష రాసేందుకు విద్యార్థులంతా హాల్‌లోకి వచ్చారు. వచ్చి రాగానే ఓ స్టూడెంట్ (Male Student) కింద పడిపోయాడు. ఆ తర్వాత ఆస్పత్రి బెడ్ మీద ప్రత్యక్షమయ్యాడు. సహజంగా అమ్మాయిలు.. అబ్బాయిలను చూసి భయపడతారా? లేదంటే అబ్బాయిలు.. అమ్మాయిలను చూసి భయపడతారా? టకునే చెప్పేయొచ్చు. అబ్బాయిలను చూసే అమ్మాయిలు భయపడతారని చెప్పేస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఇంతకీ ఏమైందనే కదా మీ డౌట్. ఈ వార్త చదివాక నవ్వు ఆపుకోలేరు.
కొన్ని దశాబ్దాల నుంచి భారతదేశంలో కో-ఎడ్యుకేషన్ (Co-education)విధానం నడుస్తోంది. అనేక ప్రయోజనాలను ఆలోచించి ఈ సహవిద్య విధానాన్ని ఎడ్యుకేషన్ పాలసీలో పొందుపరిచారు. ఇది ప్రస్తుతం మన దేశంలో నడుస్తున్న విధానం. అయితే బీహార్ (Bihar)లోని నలందాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది.
పరీక్ష రాసేందుకు ఇంటర్ విద్యార్థులంతా (Inter students) ఎగ్జామ్ హాల్ (Examination hall)లోకి వచ్చారు. అయితే ఆ విద్యార్థికి ఏమైందో.. ఏమోగానీ వచ్చి రాగానే సహ విద్యార్థినులను చూసి స్పృహతప్పి పడిపోయాడు. హుటాహుటిన పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.
ఇది కూడా చదవండి: 16 ఏళ్ల బాలికకు తరచూ వాంతులు.. బక్కగా అయిపోతోందంటూ ఆస్పత్రికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు.. టెస్టులు చేసి అవాక్కైన డాక్టర్లు..
మనీష్ శంకర్ ప్రసాద్ (Manish Shankar Prasad) అనే ఇంటర్ విద్యార్థి ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. అయితే పరీక్ష రాసేందుకు బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్‌కి వచ్చాడు. పరీక్ష హాల్‌లోకి రాగానే అందరూ అమ్మాయిలే కనిపించడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన పాఠశాల యాజమాన్యం వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు. కొన్ని గంటల తర్వాత స్పృహలోకి వచ్చి అసలు విషయాన్ని బంధువులకు తెలియజేశాడు. ఎగ్జామ్ సెంటర్‌లో అందరూ అమ్మాయిలే ఉండడంతో కంగారు పడి స్పృహ తప్పి పడిపోయాడని శంకర్ బంధువులు వెల్లడించారు.
బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్‌ను కేవలం అమ్మాయిల (Female students) కోసమే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ అదే సెంటర్‌లో మనీష్ శంకర్ ప్రసాద్ ఒక్కడికే ఎగ్జామ్ సెంటర్ కేటాయించారు. అదేమీ తెలియని శంకర్.. పరీక్షా కేంద్రానికి రాగానే అక్కడున్న సీన్ చూసి కంగుతిన్నాడు. 500 మంది అమ్మాయిలను ఒక్కసారిగా చూసి భయాందోళనకు గురై స్పృహ తప్పి పడిపోయాడు. అయినా విద్యార్థినుల కోసం కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని మగ విద్యార్థికి ఎలా ఏర్పాటు చేస్తారని శంకర్ ప్రసాద్ బంధువు తప్పుపట్టారు.