Woman: పాపం.. 24 ఏళ్ల ఈ యువతికి పెద్ద కష్టమే వచ్చి పడింది.. ఆమె చేసిన ఒక్క మిస్టేక్‌తో ఎంత ఘోరం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-07-17T20:38:10+05:30 IST

ఆ 24 ఏళ్ల యువతి ఢిల్లీలోని ఓ బ్యూటీపార్లర్‌లో పని చేస్తోంది.. ఆమెకు ఓ మీటింగ్‌లో రాహుల్ ప్రధాన్ అనే యువకుడు పరిచయమయ్యాడు.. ఇద్దరి మధ్య స్నేహం పెరిగి ఆ తర్వాత అది ప్రేమగా మారింది.. ఆ తర్వాత ఇద్దరూ పలుసార్లు శారీరకంగా కలుసుకున్నారు.. అంతేకాదు ఆమెను ఆ యువకుడు వివాహం కూడా చేసుకున్నాడు..

Woman: పాపం.. 24 ఏళ్ల ఈ యువతికి పెద్ద కష్టమే వచ్చి పడింది.. ఆమె చేసిన ఒక్క మిస్టేక్‌తో ఎంత ఘోరం జరిగిందంటే..!

ఆ 24 ఏళ్ల యువతి ఢిల్లీలోని ఓ బ్యూటీపార్లర్‌లో పని చేస్తోంది.. ఆమెకు ఓ మీటింగ్‌లో రాహుల్ ప్రధాన్ అనే యువకుడు పరిచయమయ్యాడు.. ఇద్దరి మధ్య స్నేహం పెరిగి ఆ తర్వాత అది ప్రేమ (Love Affair)గా మారింది.. ఆ తర్వాత ఇద్దరూ పలుసార్లు శారీరకంగా కలుసుకున్నారు.. అంతేకాదు ఆమెను ఆ యువకుడు వివాహం (Marriage) కూడా చేసుకున్నాడు.. తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడు.. ఆమె నుంచి పలు అవసరాల కోసం రూ.8 లక్షలు తీసుకున్నాడు.. ఇటీవల ఆ యువతికి షాకింగ్ విషయం తెలిసింది (Cheating). తన భర్త రాహుల్ అసలు పేరు జునైద్ అని, అతడు ఓ ముస్లిం అని బయటపడింది.

ఢిల్లీ (Delhi)లో ఉంటున్న ఓ యువతికి గతేడాది ఫిబ్రవరిలో జునైద్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది. జునైద్ తనను తాను రాహుల్ ప్రధాన్‌గా పరిచయం చేసుకుని స్నేహం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరూ శారీరకంగా కూడా దగ్గరయ్యారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆ యువతి అడ్డు చెప్పలేదు. అంతేకాదు ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో జునైద్ ఫొటోలు, వీడియోలు కూడా తీశాడు. ఆ తర్వాత చెప్పినట్టుగానే ఆ యువతిని వివాహం చేసుకున్నాడు. తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. జునైద్ కుటుంబ సభ్యులందరూ ఆమెతో హిందువుల్లాగానే ప్రవర్తించారు (Crime News).

Viral Video: పోలీసాయన కర్కశత్వం.. ప్లాట్‌ఫామ్ మీద పడుకున్న చిన్న పిల్లాడిపై దౌర్జన్యం.. వైరల్ అవుతున్న వీడియో!

వారం రోజుల క్రితం ఆ యువతికి షాకింగ్ విషయం తెలిసింది. తన భర్త ఓ ముస్లిం అని, అంతేకాదు అతడికి గతంలోనే వివాహం కూడా జరిగిందని బయటపడింది. డబ్బుల కోసమే తనను ట్రాప్ చేశాడని కనిపెట్టింది. అప్పటికే ఆమె అతడికి రూ. 8 లక్షల వరకు ఇచ్చింది. ఆ డబ్బులను వెనక్కి అడిగితే జునైద్ బెదిరింపులకు దిగాడు. ప్రైవేట్ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించింది. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2023-07-17T20:38:10+05:30 IST