Man Cheats Girlfriend: వామ్మో.. వాళ్లు వీడియోలు తీయకపోయి ఉంటే.. ఈ ప్రియుడి బండారం బయటపడేదే కాదు..!
ABN , First Publish Date - 2023-09-16T19:37:07+05:30 IST
ఎంతగానో నమ్మి మనస్ఫూర్తిగా ప్రేమించిన వారిని మోసం చేయడం చాలా దుర్మార్గమైన పని. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా చాలా మంది తమ ప్రేమికుల విషయంలో నిజాయితీగా వ్యవహరించడం లేదు. . ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ యువకుడు అలాగే చేశాడు.
ఎంతగానో నమ్మి మనస్ఫూర్తిగా ప్రేమించిన వారిని మోసం (Cheating) చేయడం చాలా దుర్మార్గమైన పని. అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇలాంటి ఛీటింగ్‌లు పెద్ద ట్రెండ్‌గా మారాయి. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా చాలా మంది తమ ప్రేమికుల విషయంలో నిజాయితీగా వ్యవహరించడం లేదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video)లో ఓ యువకుడు అలాగే చేశాడు. తన ప్రేయసి స్నేహితురాలితో నడిరోడ్డుపై రొమాన్స్ చేస్తూ దొరికిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే షాకవడం ఖాయం (Man Cheats Girlfriend).
@HumansNoContext అనే ట్విటర్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారులో ఓ యువకుడు తన ప్రేయసి స్నేహితురాలితో రొమాన్స్ సాగిస్తున్నాడు. ఆ విషయం తెలుసుకున్న ప్రేయసి బైక్‌పై అక్కడకు వచ్చింది. బాయ్‌ఫ్రెండ్‌ను బయటకు పిలిచి అతడితో గొడవకు దిగింది. ఆ యువకుడు ఆమెను శాంతింపచేయడానికి ప్రయత్నిస్తుండగా కారులో ఉన్న యువతి మెల్లిగా వేరే డోర్ నుంచి దిగి కనబడకుండా వెళ్లిపోయింది. ఆ యువతి కారును తనిఖీ చేసి లోపల ఎవరూ లేరని తెలుసుకుని శాంతించింది.
Snake Video: పామును ముద్దు పెట్టుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నం.. సడన్‌గా పెదవులపై కాటేసిన సర్పం.. చివరకు..!
కారులో రొమాన్స్ సాగించిన యువతి కొద్ది సేపటి తర్వాత వెనక్కి వచ్చి ఏమీ తెలియనట్టు నటించి ఆమెను కౌగిలించుకుని ఓదార్చింది. ఆ తర్వాత ముగ్గురూ కలిసి కారులో వెళ్లిపోయారు. ఈ ఘటన మొత్తాన్ని ఓ ఇంటి నుంచి కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 1.70 కోట్ల మంది వీక్షించారు. అమాయకురాలిని ప్రియుడు, స్నేహితురాలు చేసిన మోసం చూసి నెటిజన్లు అసహ్యించుకుంటున్నారు.