Viral Video: ప్లేట్‌లో 135 ఎర్రెర్రటి మిరపకాయలు.. ఈ వ్యక్తి ఎన్ని నిమిషాల్లో వాటన్నిటినీ ఎలా తినేశాడో చూస్తే..!

ABN , First Publish Date - 2023-10-04T15:31:33+05:30 IST

బాగా కారంగా, ఘటుగా ఉండే ఆహార పదార్థాలను (Spicy Foods) తినేందుకు కొందరు ఇష్టపడుతుంటారు. మరికొందరు నేరుగా పచ్చి మిరపకాయలనే (Hot Chillies) తినేస్తుంటారు. అయితే ఒకటో, రెండో తింటే ఫర్వాలేదు కానీ, ఒకసారి ఎక్కువ తినేస్తే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.

Viral Video: ప్లేట్‌లో 135 ఎర్రెర్రటి మిరపకాయలు.. ఈ వ్యక్తి ఎన్ని నిమిషాల్లో వాటన్నిటినీ ఎలా తినేశాడో చూస్తే..!

బాగా కారంగా, ఘటుగా ఉండే ఆహార పదార్థాలను (Spicy Foods) తినేందుకు కొందరు ఇష్టపడుతుంటారు. మరికొందరు నేరుగా పచ్చి మిరపకాయలనే (Hot Chillies) తినేస్తుంటారు. అయితే ఒకటో, రెండో తింటే ఫర్వాలేదు కానీ, ఒకసారి ఎక్కువ తినేస్తే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. అయినా లెక్క చేయకుండా ఓ వ్యక్తి కేవలం 6 నిమిషాలలో 135 మిరపకాయలను తినేశాడు. తక్కువ సమయంలో ఎక్కువ మిరపకాలను తిన్న వ్యక్తిగా ప్రపంచ రికార్డు (World Record) సృష్టించాడు.

కెనడాకు (Canada) చెందిన మైక్ జాక్ (Mike Jack) అనే వ్యక్తి 6 నిమిషాల 49.2 సెకన్లలో మొత్తం 135 కరోలినా రీపర్స్ మిరపకాయలు (Carolina Reapers Peppers) తిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. @GWR అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో (Viral Video) మైక్ జాక్ తలపై ఎర్రటి హెయిర్ బ్యాండ్ ధరించి, చేతులకు గ్లౌజులు వేసుకుని ముందు కరోలినా రీపర్స్ మిరపకాయలతో నిండిన ప్లేట్ పెట్టుకున్నాడు. అమెరికాలో పండించే కరోలినా రీపర్స్ మిరప ప్రపంచంలోనే అత్యంత ఘాటుగా ఉండే మిర్చి. నేరుగా ఒక్క మిరపకాయ తిన్నా నోటిలో ఎంత మంట వస్తుందో ఊహించలేము.

అలా ఒకదాని తర్వాత ఒకటి తింటూ మైక్ జాక్ మొత్తం 6 నిమిషాల 49.2 సెకన్లలో 135 కరోలినా రీపర్స్ మిరపకాయలు తినేశాడు. తింటున్నప్పుడు కడుపంతా తిమ్మిరిగా మారిపోయిందని, పేగులను ఎవరో మెలిపెడితున్నట్టు అనిపిస్తోందని జాక్ పేర్కొన్నాడు. మొత్తానికి ఆ మిరపకాయలను తిని ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ వీడియోను ఇప్పటివరకు 34 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు.

Updated Date - 2023-10-04T15:31:33+05:30 IST