Shocking: భార్యపై కోపంతో మర్మాంగాన్ని కట్ చేసుకున్న భర్త.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2023-01-22T15:53:14+05:30 IST

సంసారం అన్నాక చిన్నా చితకా గొడవలు వస్తుంటాయి. భర్త మీద అలిగి భార్య పుట్టింటికి వెళ్లిపోవడం, కొన్ని రోజుల తర్వాత తిరిగి కాపురానికి రావడం చాలా మంది జీవితాల్లో సాధారణంగా జరిగేవే. అయితే చిన్న చిన్న గొడవలకే కొందరుమనస్థాపానికి గురై తీవ్ర నిర్ణయాలు తీసుకుంటుంటారు.

Shocking: భార్యపై కోపంతో మర్మాంగాన్ని కట్ చేసుకున్న భర్త.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

సంసారం అన్నాక చిన్నా చితకా గొడవలు వస్తుంటాయి. భర్త మీద అలిగి భార్య పుట్టింటికి వెళ్లిపోవడం, కొన్ని రోజుల తర్వాత తిరిగి కాపురానికి రావడం చాలా మంది జీవితాల్లో సాధారణంగా జరిగేవే. అయితే చిన్న చిన్న గొడవలకే కొందరు మనస్థాపానికి గురై తీవ్ర నిర్ణయాలు తీసుకుంటుంటారు. తాజాగా బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదని తన మర్మాంగాన్ని (Bihar man chops off his private part) కత్తిరించేసుకున్నాడు. రక్తపు మడుగులో ఉన్న అతడిని కుటుంబీకులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

బిహార్‌లోని (Bihar News) మాధేపురాకు చెందిన కృష్ణ అనే వ్యక్తికి అనిత అనే యువతితో వివాహమైంది. వీరికి నలుగురు పిల్లలు. కుటుంబ పోషణ కోసం కృష్ణ పంజాబ్‌లోని మండిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల తన కుటుంబ సభ్యులను చూసేందుకు సొంతూరుకు వెళ్లాడు. అప్పటికే కృష్ణ భార్య అనిత పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త వచ్చాడని తెలిసినా అత్తింటికి వచ్చేందుకు నిరాకరించింది. భర్త అడిగితే రేపు వస్తా, ఎల్లుండి వస్తా అంటూ కాలయాపన చేసింది.

భార్య ప్రవర్తనతో తీవ్ర మనస్థాపానికి గురైన కృష్ణ పదునైన ఆయుధంతో తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. సకాలంలో గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే కృష్ణను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కృష్ణ ఆస్పత్రిలో చికిత్స అందుకుంటున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనితపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-01-22T15:53:16+05:30 IST