Shocking: ఒక్క చెంపదెబ్బతో ప్రాణం పోయింది.. ముంబై రైల్వే స్టేషన్లో దారుణం.. అసలేం జరిగిందంటే..
ABN , First Publish Date - 2023-08-18T11:03:58+05:30 IST
ముంబైలోని ఓ రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. ఒకే ఒక్క చెంపదెబ్బ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఆ షాకింగ్ ఘటనతో అందరూ నివ్వెరపోయారు. ముంబైలో నివసిస్తున్న అవినాష్, శీతల్ అనే భార్యాభర్తలు మంఖార్డ్ వెళ్లేందుకు సియోన్ రైల్వే స్టేషన్‌కు ఆదివారం రాత్రి చేరుకున్నారు.
ముంబై (Mumbai)లోని ఓ రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. ఒకే ఒక్క చెంపదెబ్బ (Slap) ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఆ షాకింగ్ ఘటనతో అందరూ నివ్వెరపోయారు. ముంబైలో నివసిస్తున్న అవినాష్, శీతల్ అనే భార్యాభర్తలు మంఖార్డ్ వెళ్లేందుకు సియోన్ రైల్వే స్టేషన్ (Sion Railway Station)కు ఆదివారం రాత్రి చేరుకున్నారు. ఆ సమయంలో దినేష్ (26) అనే యువకుడు శీతల్ పక్కన వచ్చి నిల్చున్నాడు. దినేష్ తనను వెనుక నుంచి తోశాడని శీతల్ ఆరోపించింది. ఆ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది (Crime Nedws).
ఆ వాగ్వాదం కాస్తా గొడవగా మారింది. దినేష్‌ను శీతల్ గొడుగుతో కొట్టింది. ఆ తర్వాత అవినాష్ కూడా భార్యకు జతకలిశాడు. దినేష్‌ను బలంగా చెంపదెబ్బ కొట్టాడు. దీంతో దినేష్ ప్లాట్‌ఫామ్ పై నుంచి రైల్వే ట్రాక్‌పై పడిపోయాడు (Man Falls On Tracks). తిరిగి ప్లాట్‌ఫామ్ పైకి ఎక్కేందుకు దినేష్ ప్రయత్నించాడు. అయితే అంతలో అదే ట్రాక్‌పై వేగంగా ఓ రైలు దూసుకువస్తోంది. ఆ రైలును చూసి దినేష్‌కు సహాయం చేసేందుకు వచ్చిన వారు కూడా పారిపోయారు. రెప్పపాటులో ఆ రైలు దినేష్ పై నుంచి దూసుకుపోయింది.
Wife: అత్తమామలను పిలిచి అన్నం వడ్డించిన కోడలు.. కాసేపటికే ఇంట్లో ముగ్గురు మృతి.. అసలు ఆమె ఏం వండిందంటే..!
దినేష్ అక్కడికక్కడే మరణించారు. దినేష్ మరణించడంతో అవినాష్, అతడి భార్య బయటకు పారిపోయారు. ధారావిలోని తమ నివాసానికి వెళ్లిపోయారు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అవినాష్, అతడి భార్య శీతల్‌ను పోలీసులు గుర్తించారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.