Viral Video: కంట తడి పెట్టిస్తున్న వీడియో.. చేతులు లేకపోయినా కుటుంబం కోసం ఎంతలా కష్టపడుతున్నాడో చూడండి..

ABN , First Publish Date - 2023-10-01T10:47:29+05:30 IST

పిల్లలకు మెరుగైన జీవితాన్ని అందించేందుకు, వారికి ఎలాంటి కష్టాలు కలగకుండా చూసేందుకు తల్లిదండ్రులు ఎప్పుడూ తపన పడుతుంటారు. ఊపిరి ఉన్నంత వరకు ఏది ఏమైనా పిల్లల కోసం కష్టపడుతుంటారు. తల్లి ఇంట్లో పిల్లలను సంరక్షిస్తుంటే, తండ్రి వారిని పోషించేందుకు ఎలాంటి పని చేయడానికైనా సిద్ధపడతాడు.

Viral Video: కంట తడి పెట్టిస్తున్న వీడియో.. చేతులు లేకపోయినా కుటుంబం కోసం ఎంతలా కష్టపడుతున్నాడో చూడండి..

పిల్లలకు మెరుగైన జీవితాన్ని అందించేందుకు, వారికి ఎలాంటి కష్టాలు కలగకుండా చూసేందుకు తల్లిదండ్రులు (Parents) ఎప్పుడూ తపన పడుతుంటారు. ఊపిరి ఉన్నంత వరకు ఏది ఏమైనా పిల్లల కోసం కష్టపడుతుంటారు. తల్లి (Mother) ఇంట్లో పిల్లలను సంరక్షిస్తుంటే, తండ్రి (Father) వారిని పోషించేందుకు ఎలాంటి పని చేయడానికైనా సిద్ధపడతాడు. కుటుంబాన్ని పోషించేందుకు ఓ వ్యక్తి తన వైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడుతున్నాడు. ఆ వీడియో (Emotional Video) చాలా మందిని కంటతడి పెట్టిస్తోంది.

Zindagi.gulzar.h అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తికి రెండు చేతులూ (Hands) లేవు. అయినా సరే బాధపడకుండా కృత్రిమ చేతులు అమర్చుకుని మరీ డ్రమ్స్ వాయిస్తున్నాడు. రోడ్డు పక్కన కూర్చుని కృత్రిమ చేతులతో డ్రమ్స్ (Drums) వాయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ``ఒక తండ్రి తన పిల్లలను పోషించడానికి ఏమైనా చేస్తాడు`` అని కామెంట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

Viral Video: ఈ రైతు సామాన్యుడు కాదు.. ఆడీ కారులో వచ్చి ఆకుకూరలు అమ్ముతున్నాడు.. నెటిజన్లు ఏమంటున్నారంటే!

ఈ వీడియోను ఇప్పటివరకు 1.37 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఎమోషనల్‌గా కామెంట్లు చేస్తున్నారు. ``నొప్పి కంటే తండ్రి బాధ్యత పెద్దది``, ``పిల్లల పట్ల తండ్రికి ఉన్న ప్రేమ, అంకితభావానికి ఇది నిదర్శనం``, ``పిల్లల కోసం తండ్రి ఎంతటి కష్టాన్నైనా భరిస్తాడు``, ``ఈ మ్యూజిక్ ఎప్పటికీ ఆగదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-10-01T10:47:41+05:30 IST