Viral Video: నువ్వు గ్రేట్ భయ్యా.. లుంగీ పవర్ ఏంటో చూపించావు! షాపింగ్‌మాల్‌కు వెళ్లిన ఆ వ్యక్తి లుంగీతో ఏం చేశాడంటే..
ABN , First Publish Date - 2023-08-02T16:16:20+05:30 IST
చాలా సులభంగా ధరించేందుకు వీలయ్యే లుంగీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. లుంగీకి దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. షారూక్ ఖాన్ ``లుంగీ డ్యాన్స్`` సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిలో లుంగీని ఎక్కువగా ధరిస్తూ ఉంటారు.
చాలా సులభంగా ధరించేందుకు వీలయ్యే లుంగీ (Lungi)కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. లుంగీకి దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. షారూక్ ఖాన్ ``లుంగీ డ్యాన్స్`` (Lungi Dance) సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిలో లుంగీని ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. విశ్రాంతి సమయాల్లో అయినా, ప్రత్యేక సందర్భాల్లో అయినా రకరకాల లుంగీలను ధరిస్తాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం లుంగీని విభిన్నంగా ఉపయోగించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Jugad video).
@HasnaZarooriHai అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి లుంగీ కట్టుకుని షాపింగ్ మాల్ (Shopping Mall)కు వెళ్లాడు. మాల్ అంతా తిరిగి తనకు కావాల్సిన వస్తువులను కొనుక్కున్నాడు. వాటికి బిల్లు వేస్తున్న సమయంలో క్యాషియర్ ``బ్యాగు కావాలా?`` (Carry Bag) అని అడిగింది. అతడు ``వద్దు`` అని సమాధానం ఇచ్చాడు. అన్ని వస్తువులను అలా తీసుకెళ్తాడా అని ఆమె ఆలోచనలో పడింది.
Viral: చెన్నై వాసుల్లో కొత్త భయం.. గాల్లో ఎగురుతూ కనిపించిన నాలుగు వింత ఆకారాలు.. ఏలియన్స్ వచ్చారంటూ..!
ఆ వ్యక్తి సింపుల్‌గా తను కట్టుకున్న లుంగీని తీసి నేలపై పరిచాడు. దాంట్లో తాను కొన్న వస్తువులను పడేశాడు. తర్వాత వాటిని మూటకట్టి బయటకు తీసుకుపోయాడు. కొద్దిసేపటి తర్వాత దాన్ని భుజాల మీద వేసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)గా మారింది. ఇప్పటివరకు 28 వేల మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియో (Funny Video) చూస్తున్న నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.