పాపం.. ఆ మహిళను అత్యాచారం చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు.. వివాహం తర్వాత అసలు విషయం తెలిసి ఖంగుతిన్నాడు..
ABN , First Publish Date - 2023-03-13T14:49:51+05:30 IST
మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ మహిళ కొన్ని రోజుల క్రితం చిత్రకూట్ చూసేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లింది. అక్కడ ఆమెకు ఓ యువకుడు పరిచయమయ్యాడు.
మధ్యప్రదేశ్‌కు (Madhya Pradesh) చెందిన ఆ మహిళ కొన్ని రోజుల క్రితం చిత్రకూట్ చూసేందుకు ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) వెళ్లింది. అక్కడ ఆమెకు ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆ యువకుడు ఆమెను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటనను వీడియో తీసి ఆమెను బెదరించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కొద్ది రోజులకు అతడికి షాకింగ్ విషయం తెలిసింది. తను అంత పెళ్లి చేసుకున్న మహిళపై అప్పటికే 22 పోలీసు కేసులు ఉన్నాయని, ఆమె పెద్ద ఖిలాడీ అని తెలుసుకుని షాకయ్యాడు (Crime News).
ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ చూడడానికి వచ్చిన మహిళను స్థానికుడైన ఇర్షాద్ ట్రాప్ చేశాడు. ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటన మొత్తాన్నీ వీడియో తీసి దాంతో బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనను పెళ్లి చేసుకోకపోతే ఆ వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆ మహిళ ఇర్షాద్‌ను వివాహం చేసుకుని, అతడి దగ్గరే ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత పోలీసుల ద్వారా ఇర్షాద్‌కు షాకింగ్ విషయం తెలిసింది. తన భార్యపై మధ్యప్రదేశ్‌లో 22 ఛీటింగ్ కేసులు ఉన్నాయని తెలిసింది (Robber Bride).
H3N2 virus: దేశాన్ని వణికిస్తున్న ఈ కొత్త వైరస్ అంత ప్రమాదకరమా? దీని లక్షణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆ మహిళ మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో అప్పటికే 22 మందిని దొంగ వివాహాలు (Fake Marriages) చేసుకుని, వారి నగలు, డబ్బు అపహరించింది. దీంతో వారందరూ ఆమెపై కేసులు పెట్టారు. అక్కడి నుంచి తప్పించుకుని ఉత్తరప్రదేశ్ వచ్చిన ఆమెను ఇర్షాద్ వివాహం చేసుకున్నాడు. మధ్యప్రదేశ్ పోలీసులు ఆమె కోసం గాలిస్తూ యూపీలోని చిత్రకూట్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఇర్షాద్‌కు అసలు విషయం తెలిసి షాకయ్యాడు. ప్రస్తుతం ఆమెను పోలీసులు విచారిస్తున్నారు.