Viral Video: ప్రాణాలకు తెగించావు కదయ్యా.. ఒక్క క్షణం ఆలోచించి ఆగి ఉంటే ఆ పాప బతికేదే కాదేమో..!

ABN , First Publish Date - 2023-08-25T17:04:35+05:30 IST

ప్రపంచంలో రోజురోజుకూ స్వార్థం పెరిగిపోతోందని, ఇతరులకు సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అది పూర్తి స్థాయిలో నిజం కాకపోవచ్చు. ఎందుకంటే ఇతరులను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేవారు ఇప్పటికీ ఉన్నారు.

Viral Video: ప్రాణాలకు తెగించావు కదయ్యా.. ఒక్క క్షణం ఆలోచించి ఆగి ఉంటే ఆ పాప బతికేదే కాదేమో..!

ప్రపంచంలో రోజురోజుకూ స్వార్థం పెరిగిపోతోందని, ఇతరులకు సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అది పూర్తి స్థాయిలో నిజం కాకపోవచ్చు. ఎందుకంటే ఇతరులను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేవారు ఇప్పటికీ ఉన్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే కచ్చితంగా నిజమని నమ్ముతారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువకుడు ఓ చిన్నారి ప్రాణాలను కాపాడే క్రమంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు (Man risks life to save girl).

@idiotsInCamera అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ రోడ్డుపై వేగంగా వాహనాలు వెళ్తున్నాయి. రోడ్డు దాటేందుకు ఓ యువకుడు వేచి చూస్తున్నాడు. అవతలి వైపు ఓ బాలిక (Girl) రోడ్డు మీద వాహనాలను పట్టించుకోకుండా రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో వేగంగా ఓ జీపు వస్తోంది. ఆ జీపును గుర్తించిన యువకుడు వేగంగా వెళ్లి ఆ పాపను పట్టుకున్నాడు. అదృష్టవశాత్తూ, డ్రైవర్ కారుకు బ్రేకులు వేయడంతో ఎవరకీ ప్రమాదం వాటిల్లలేదు.

School Girls Video: స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలు.. నడిరోడ్డుపై ఏం చేశారో చూస్తే..!

ఆ వ్యక్తి తక్షణమే తెలివిగా వ్యవహరించి చిన్నారిని కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన అంతా సమీపంలోని భవనంలో అమర్చిన సీసీటీవీలో రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 1.78 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. ఆ వీడియోలోని వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ``సూపర్ హీరో`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-08-25T17:04:35+05:30 IST