Shocking Video: వామ్మో.. లిఫ్ట్ ఇలా కూడా ఎక్కుతారా? అప్పుడే బయటకు వచ్చిన యువతి ఎలా భయపడిందో చూడండి..
ABN , First Publish Date - 2023-11-12T16:01:39+05:30 IST
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొందరు వ్యక్తులు ఏం చేయడానికైనా వెనుకాడరు. బహిరంగ ప్రదేశాల్లో విచిత్ర విన్యాసాలు చేసి వాటిని రికార్డు చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. వాటిల్లో కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని వీడియోలు హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి.
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొందరు వ్యక్తులు ఏం చేయడానికైనా వెనుకాడరు. బహిరంగ ప్రదేశాల్లో విచిత్ర విన్యాసాలు చేసి వాటిని రికార్డు చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. వాటిల్లో కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని వీడియోలు హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. తాజాగా ఒక వ్యక్తి తన ట్యాలెంట్ (Talent)తో ప్రజలను ఆశ్చర్యపరిచేందుకు ప్రయత్నించాడు. అతడిని చూసి కొందరు భయపడ్డారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)గా మారింది.
aditya_crazybones అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోను భోపాల్ (Bhopal)లోని ఓ షాపింగ్ మాల్‌లో చిత్రీకరించారు. ఆ వీడియోలోని వ్యక్తి లిఫ్ట్ (Lift) దగ్గరకు చేరుకుని అకస్మాత్తుగా బ్రిడ్జ్ భంగిమలో ముందుకు వంగి నడవడం ప్రారంభించాడు. అతడిని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. లిఫ్ట్ ఎక్కేందుకు వెళ్తుండగా.. అప్పుడే బయటకు వచ్చిన యువతి అతడిని చూసి భయపడిపోయింది. ఆ యువకుడు ఏమీ పట్టించుకోకుండా లిఫ్ట్‌లోకి అదే భంగిమలో నడుచుకుంటూ వెళ్లి బటన్ నొక్కాడు.
Afghanistan: అఫ్గాన్ క్రికెటర్ గొప్ప మనసు.. అర్ధరాత్రి అహ్మదాబాద్ రోడ్ల పైకి.. ఫుట్‌పాత్‌లపై నిద్రపోతున్న వారికి దీపావళి గిఫ్ట్స్!
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలోని యువకుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ``సోదరా.. అద్భుతమైన ట్యాలెంట్``, ``ఈ కుర్రాడికి సినిమాలో అవకాశం వస్తే బాగుండేది``, ``ఇది చాలా కష్టం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.