Viral Video: బస్సులో షాకింగ్ సీన్.. వెనుక సీట్లో కూర్చుని వెకిలి చేష్టలు.. భరించలేక ఈ యువతి ఏం చేసిందో మీరే చూడండి..!
ABN , First Publish Date - 2023-06-05T16:12:09+05:30 IST
ఎన్ని కఠిన చట్టాలు చేసి, శిక్షలు విధిస్తున్నా మహిళల పట్ల పరుషుల దురాగతాలు ఆగడం లేదు. ఏ అమ్మాయి అయినా ఒంటరిగా కనిపిస్తే చాలు మృగంలా మారిపోతున్నారు. తాజాగా కర్ణాటకలో ఓ వ్యక్తి బస్సులో వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. బస్సులో ఒంటరిగా కూర్చున్న యువతి వెనుక సీట్లో కూర్చుని వెకిలిగా ప్రవర్తించాడు.
ఎన్ని కఠిన చట్టాలు చేసి, శిక్షలు విధిస్తున్నా మహిళల పట్ల పరుషుల దురాగతాలు ఆగడం లేదు. ఏ అమ్మాయి అయినా ఒంటరిగా కనిపిస్తే చాలు మృగంలా మారిపోతున్నారు. తాజాగా కర్ణాటకలో (Karnataka) ఓ వ్యక్తి బస్సులో వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. బస్సులో ఒంటరిగా కూర్చున్న యువతి వెనుక సీట్లో కూర్చుని వెకిలిగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు (Man tries to touch girl inappropriately). అతడి చేష్టలను భరించలేకపోయిన యువతి అతడికి తగిన బుద్ధి చెప్పింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
కర్ణాటకలోని మాండ్య బస్టాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ఒంటరిగా ఉన్న కూర్చున్న యువతి వెనుక సీటులో ఓ ఆకతాయి యువకుడు కూర్చున్నాడు. ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు (Eve-teasing). కొద్ది సేపు సహనం వహించిన ఆ యువతి తర్వాత తన ప్రతాపం చూపించింది. ఆ యువకుడిని కాలర్ పట్టుకుని పైకి లేపి కొట్టడం ప్రారంభించింది. అదే బస్సులో ఉన్న వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Wife: ఓ భార్య చెప్పుతో కొట్టబోతోంటే.. రెండో భార్య కాపాడుతోంది.. నడి రోడ్డుపై భార్యాభర్తల ఫైటింగ్.. చివరకు..!
``మాండ్యలోని ఓ యువతి తనను టీజ్ చేసిన వాడిని చితక్కొట్టింది. సభ్యతగా వ్యవహరించాలని ఆమె కోరినా అతడు తన పని మానలేదు. దీంతో ఆ యువతి అతడికి గుణపాఠం చెప్పింది. బస్సులో ఉన్న ఎవరూ ఆమెకు సహాయం చేయలేదు. ఆ తర్వాత ఆ యువకుడు బస్సు దిగి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీస్ కంప్లైంట్ నమోదు కాలేదు. బస్సులో ఉన్న ప్యాసింజర్ ఈ వీడియో తీశాడ``ని ట్విటర్ యూజర్ పేర్కొన్నారు. ఆ యువతి ధైర్యంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.