కుక్కలా మారిన మనిషికి ఆడ తోడు కావాలంటా.. ఎందుకో తెలుసా?

ABN , First Publish Date - 2023-09-13T16:20:55+05:30 IST

కుక్కల మీద ప్రేమతో ఓ వ్యక్తి శునకంలా మారిపోయాడు గుర్తుందా. అదేనండీ జపాన్ కి చెందిన టోకో కథే ఇది. గతేడాది ఆయన కుక్కలా మారడానికి రూ.12 లక్షలు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా కాస్ట్యూమ్ డిజైన్ చేయించుకున్నాడు. కాస్ట్యూమ్ వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు. తన యూట్యూబ్ ఛానల్ లో ఇందుకు సంబంధించిన వీడియోలన్నీ అప్ లోడ్ చేశాడు. ఇప్పుడు అతను మళ్లీ వార్తల్లో నిలిచాడు. తనకు మరో ఆడ కుక్క జత కావాలని కోరుకుంటున్నాడు.

కుక్కలా మారిన మనిషికి ఆడ తోడు కావాలంటా.. ఎందుకో తెలుసా?

కుక్కల మీద ప్రేమతో ఓ వ్యక్తి శునకంలా మారిపోయాడు గుర్తుందా. అదేనండీ జపాన్ కి చెందిన టోకో కథే ఇది. గతేడాది ఆయన కుక్కలా మారడానికి రూ.12 లక్షలు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా కాస్ట్యూమ్ డిజైన్ చేయించుకున్నాడు. కాస్ట్యూమ్ వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు. తన యూట్యూబ్ ఛానల్ లో ఇందుకు సంబంధించిన వీడియోలన్నీ అప్ లోడ్ చేశాడు.

ఇప్పుడు అతను మళ్లీ వార్తల్లో నిలిచాడు. తనకు మరో ఆడ కుక్క జత కావాలని కోరుకుంటున్నాడు. తాము సినిమాల్లో నటించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. అంత డబ్బు ఖర్చు పెట్టి కుక్క కాస్ట్యూమ్ చేయించుకున్న ఈయన కుక్కలా మారి వీధుల్లో తిరిగిన వీడియోలు గతేడాదే బయటకి వచ్చాయి. తాజాగా సినిమాల్లో నటించాలని ఉందని చెప్పడంతో మరో సారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు.

Updated Date - 2023-09-13T16:27:31+05:30 IST