కలుద్దామంటూ న్యూఇయర్ రోజున ప్రేయసి నుంచి ఆహ్వానం.. ఆమెను కలిసిన మరుక్షణంలోనే అతడికి ఊహించని షాక్..
ABN , First Publish Date - 2023-01-04T16:38:35+05:30 IST
యువతులు, మహిళలతో ఏర్పడే పరిచయాలు.. కొన్నిసార్లు అనుకోకుండా ప్రేమగా మారడమో లేక వివాహేతర సంబంధానికి దారి తీయడమో జరుగుతుంటుంది. ఫోన్లలో అవతలి వైపు నుంచి అమ్మాయిల గొంతు వినబడితే చాలు.. ఎలాగైనా వారిని..
యువతులు, మహిళలతో ఏర్పడే పరిచయాలు.. కొన్నిసార్లు అనుకోకుండా ప్రేమగా మారడమో లేక వివాహేతర సంబంధానికి దారి తీయడమో జరుగుతుంటుంది. ఫోన్లలో అవతలి వైపు నుంచి అమ్మాయిల గొంతు వినబడితే చాలు.. ఎలాగైనా వారిని దగ్గర చేసుకోవాలని కొందరు వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ఊహించని షాక్ తగులుతుంటుంది. రాజస్థాన్‌లో ఓ వ్యక్తి విషయంలో ఇలాగే జరిగింది. ఫోన్లో పరిచయమైన కొన్నాళ్లకు.. కలుద్దామంటూ న్యూఇయర్ సందర్భంగా ప్రేయసి చెప్పడంతో అతడు ఎగిరి గంతేశాడు. తీరా ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లిన కాసేపటికి.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉద్యోగం మానేయడం లేదని భార్యకు తలాక్ చెప్పిన భర్త.. ఆడవాళ్లకు జాబ్ చేసే హక్కు లేదంటూ..
రాజస్థాన్ (Rajasthan) భరత్‌పూర్ పరిధి చిక్కానాకు సమీపంలోని ఖమ్ర గ్రామానికి చెందిన శ్యామ్ వీర్ అనే వ్యక్తికి.. ఇటీవల గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడిన మహిళ.. తనని తాను కవితాదేవిగా పరిచయం చేసుకుంది. అప్పటి నుంచి రోజూ ఫోన్లలో మాట్లాడుకునే వారు. కొన్ని రోజులకు వీరి మధ్య ప్రేమ (love) మొదలైంది. ఆమెను కలవాలని శ్యామ్ వీర్.. ఎన్నిసార్లు అడిగినా ఆమె మాత్రం వాయిదా వేస్తూ వచ్చింది. అయితే అనూహ్యంగా న్యూ ఇయర్ (New Year) రోజున శ్యామ్‌కు ఫోన్ చేసిన కవితా దేవి.. కలుద్దామంటూ పిలించింది. దీంతో ఎగిరి గంతేసిన శ్యామ్ వీర్.. ఆమె చెప్పిన ప్రాంతానికి తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు.
మందు పార్టీ చేసుకున్న మామా, అల్లుళ్లు.. నిద్రపోయి లేచిన మామ.. ఉన్నట్టుండి తన భార్య కనపడకపోవడంతో..
గదిలోకి వెళ్లిన కొద్ది సేపటికి.. అక్కడికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. అంతా కలిసి శ్యామ్ వీర్‌ను.. తాము చెప్పినట్లు వినాలంటూ కండీషన్ పెట్టారు. అర్జంట్‌గా రూ.3లక్షలు ఇవ్వకపోతే.. అత్యాచారం కేసులో ఇరికిస్తామని (threatening) బెదిరించారు. దీంతో భయపడిపోయిన శ్యామ్.. ఇంటికి ఫోన్ చేసి డబ్బులు అడిగారు. ఉన్నట్టుండి రూ.3లక్షలు అడగడంతో వారికి కూడా అనుమానం వచ్చి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్ నంబర్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కవితాదేవితో పాటూ ఆమె సహచరులైన దినేష్, విజయ్, రాకేష్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ముఠా ఇంకా ఎవరెవరిని మోసం చేసింది, వీరి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.