Viral News: 10 మందిని పెళ్లి చేసుకుంటా.. 10 మంది పిల్లలకు తండ్రిని కావడమే నా డ్రీమ్.. అంటూ పదే పదే చెప్పి.. చివరకు ఊహించని షాకిచ్చాడు..!

ABN , First Publish Date - 2023-04-07T10:21:03+05:30 IST

మన దగ్గర బహుభార్యత్వం (Polygamy) అనేది అరుదు. అయితే, ముస్లింలలో ఇప్పటి ఇది ఒక ఆచారంగా కొనసాగుతోందన్న సంగతి తెలిసింద.

Viral News: 10 మందిని పెళ్లి చేసుకుంటా.. 10 మంది పిల్లలకు తండ్రిని కావడమే నా డ్రీమ్.. అంటూ పదే పదే చెప్పి.. చివరకు ఊహించని షాకిచ్చాడు..!

ఇంటర్నెట్ డెస్క్: మన దగ్గర బహుభార్యత్వం (Polygamy) అనేది అరుదు. అయితే, ముస్లింలలో ఇప్పటి ఇది ఒక ఆచారంగా కొనసాగుతోందన్న సంగతి తెలిసింద. కానీ, విదేశాల్లో బహుభార్యత్వం అనేది కామన్. ఇంకా చెప్పాలంటే అక్కడి వివాహాలు ఓ కాంట్రాక్ట్ మాదిరిగా ఉంటాయి. నచ్చితే కలిసి ఉండొచ్చు. లేదా విడిపోవచ్చు. ఆ తర్వాత మరొకరిని పెళ్లాడొచ్చు. ఒకవేళ అక్కడ సెట్ అవ్వకపోతే ఇంకొకరని పెళ్లి చేసుకోవచ్చు. ఇలా ఎంతమందినైనా పరిణయమాడే వెసులుబాటు అక్కడ ఉంటుంది. ఇదిగో ఈ బ్రెజిల్ (Brazil) వ్యక్తి ఇలాగే చేశాడు. ఒకరుకాదు.. ఇద్దరుకాదు.. ఇప్పటివరకు ఏకంగా 9 మందిని వివాహమాడాడు. వారిలో ముగ్గురికి ఇప్పటికే విడాకులు ఇచ్చేశాడు. ప్రస్తుతం అతనికి ఆరుగురు భార్యలు (Wives) ఉన్నారు.

అతడి పేరు ఆర్థర్ ఓ ఉర్సో (Arthur O Urso). బ్రెజిల్‌లోని సావో పాలో (Sao Paulo) వాసి. 37 ఏళ్ల అతనికి 51ఏళ్లు మొదలుకొని 21ఏళ్ల వయసు ఉన్న భార్య ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడే అతనికి అసలు సమస్య వచ్చి పడిందట. అదేంటంటే.. ఆ ఆరుగురిలో ఎవరితో ఫస్ట్ పిల్లలను కనాలి అనేది. ఒకరితో ముందుగా పిల్లలను కంటే.. ఇంకొకరు కలవరపడతారు. అలా వారిని అప్‌సెట్ చేయకూడదనేది మనోడి ఆలోచన. అందుకే బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడట. అదే సరోగసీ (Surrogacy) విధానం. "నా ఆరుగురు భార్యల్లో ఎవరికి ముందుగా గర్భం వస్తుందో ఎంపిక చేసుకోవడం ద్వారా ఎవరినీ కలవరపెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి మేము సరోగసీని ఎంచుకున్నాము" అని ఆర్థర్ తెలిపాడు.

Instant Karma: చక్కగా పడుకున్న ఆవులతో ఓ కుర్రాడి పిచ్చి చేష్టలు.. మరుక్షణమే దిమ్మతిరిగిపోయేలా రిజల్ట్.. వైరల్ వీడియో!


అంతేకాదండోయ్ ఈ సరోగసీ ప్రాసెస్ కోసం అతడు రూ. 33.38లక్షల ఖర్చు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అలాగే భవిష్యత్‌లో మరికొంత మంది పిల్లలను సైతం దత్తత తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇక ఇంతకుముందు విడాకులిచ్చిన ముగ్గురు భార్యల్లో ఒకరితో ఆర్థర్‌కు ఓ పాప పుట్టింది. ప్రస్తుతం ఆమె వయసు 10 ఏళ్లు. ఇదిలాఉంటే.. 37 ఏళ్ల ఆర్థర్ గతంలో 10 మందిని పెళ్లి చేసుకుంటా.. ఆ 10 మందితో ఒక్కొక్కరి చొప్పున పది మంది పిల్లలకు తండ్రిని కావడమే నా డ్రీమ్ అని చెప్పాడు. చివరకు ఇలా ఊహించని షాకిచ్చాడు.

Destiny: విధిరాత అంటే ఇదేనేమో.. 14 ఏళ్ల తర్వాత జైల్లోంచి బయటకు.. కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన 15 రోజులకే ఊహకందని రీతిలో మరణించాడు..!

Updated Date - 2023-04-07T10:32:08+05:30 IST