జీతం గురించి చర్చించేందుకు.. మేనేజర్‌ను షాపింగ్ మాల్ వద్ద కలిసిన మహిళ.. గంట తర్వాత అతడు చెప్పింది విని..
ABN , First Publish Date - 2023-01-13T21:08:14+05:30 IST
ఓ మహిళ కుటుంబ పోషణ నిమిత్తం.. తప్పనిసరి పరిస్థితుల్లో ఓ పనికి కుదిరింది. అయితే అక్కడ ఆమెపై మేనేజర్ కారణంగా సమస్యలు తలెత్తాయి. తాను చెప్పిన మాటకు ఒప్పుకోలేదనే కారణంతో ఏకంగా జీతాన్నే నిలిపేశాడు. కొన్నాళ్లు..
ఓ మహిళ కుటుంబ పోషణ నిమిత్తం.. తప్పనిసరి పరిస్థితుల్లో ఓ పనికి కుదిరింది. అయితే అక్కడ ఆమెపై మేనేజర్ కారణంగా సమస్యలు తలెత్తాయి. తాను చెప్పిన మాటకు ఒప్పుకోలేదనే కారణంతో ఏకంగా జీతాన్నే నిలిపేశాడు. కొన్నాళ్లు జీతం గురించి మాట్లాడదాం.. అంటూ ఆమెను పిలిచి, చివరికి దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
వరుడు ఇష్టం లేదంటూనే పెళ్లి చేసుకున్న యువతి.. చివరకు అసలు విషయం చెప్పడంతో..
ఢిల్లీ (Delhi) సమీపంలోని గురుగ్రామ్‌లో (Gurugram) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 30ఏళ్ల మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కరోనా లాక్‌డౌన్ (Corona Lockdown) కారణంగా ఆమె కుటుంబం ఆర్థిక బాగా దెబ్బతింది. అనంతర కాలంలో కుటుంబ పోషణ నిమిత్తం ఆమె కూడా పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లోని ఓ యాప్‌లో (Online App) పని చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఇటీవల ఈ మహిళపై సదరు యాప్ మేనేజర్ కన్నేశాడు. ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నించేవాడు. ఇటీవల కొంత మొత్తాన్ని ఆమెకు ఆశ చూపుతూ అడ్వాన్స్‌గా ఇవ్వాలని ప్రయత్నించాడు. అయితే ఇందుకు ఆమె తిరస్కరించింది. దీంతో ఆమె జీతాన్ని మూడు నెలల పాటు నిలిపేశాడు.
ఇటీవల ఓ రోజు జీతం గురించి మాట్లాడదాం అంటూ ఆమెను ఓ షాపింగ్ మాల్ వద్దకు పిలిచాడు. ఆమె అక్కడికి వెళ్లగానే కొద్ది సేపు మాటలు కలిపాడు. తర్వాత అల్పాహారం తినమని ఒత్తిడి చేశాడు. అది తిన్న కొద్ది సేపటికి ఆమె అపస్మారక స్థితిలోకి (state of unconsciousness) వెళ్లింది. తర్వాత ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి.. అఘాయిత్యానికి (Indecent behavior) పాల్పడడంతో పాటూ ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. మెలకువలోకి వచ్చిన తర్వాత ఆమెకు వీడియోలు చూపించి, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. వేధింపులు రోజురోజుకూ ఎక్కువ అవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.