Ambidexterity: స్పెషల్ టాలెంట్.. ఇలాంటి వారు చాలా అరుదు.. ఇంకా చెప్పాలంటే 10 లక్షల మందిలో ఒకరే ఉంటారట!
ABN , First Publish Date - 2023-02-07T09:38:53+05:30 IST
ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ బాలిక స్పెషల్ టాలెంట్ చూస్తే వావ్ అనాల్సిందే. ఇలాంటి వారు చాలా అరుదగా ఉంటారట.
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ బాలిక స్పెషల్ టాలెంట్ చూస్తే వావ్ అనాల్సిందే. ఇలాంటి వారు చాలా అరుదగా ఉంటారట. ఇంకా చెప్పాలంటే ప్రతి 10 లక్షల మందిలో కేవలం ఒక్కరికి మాత్రమే ఇలాంటి ప్రత్యేక టాలెంట్ ఉంటుందట. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మీరు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'శివాజీ' సినిమా చూసే ఉంటారు. ఈ మూవీలోని ఓ సీన్‌లో రజనీ.. తన రెండు చేతులతో రెండేసి ఫైళ్లపై సంతకాలు చేయడం మనం చూశాం. అలా సూపర్ స్టార్ ఒకేసారి రెండు చేతులతో రెండు ఫైళ్లపై స్టైల్‌గా సంతకాలు చేస్తుంటే ఆ సీన్ చూసిన మనకు వావ్ అని అనిపిస్తుంది కదూ. నిజానికి అది సినిమా. అది డూపు కూడా. కానీ, రియల్ లైఫ్‌లో ఇలాంటివి సాధ్యమా? అంటే.. కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. అయితే, మంగళూరు చెందిన ఓ బాలిక మాత్రం ఈ విషయంలో అంతకు మంచి అనేలా తన టాలెంట్ చూపిస్తుంది. ఆమె తన రెండు చేతులతో ఒకేసారి ఒకటికాదు రెండుకాదు ఏకంగా 11 రకాల స్టైల్స్‌లో రాయగలదు. అవును మీరు విన్నది నిజమే. ఇలా ఆమె రాస్తున్న స్టైల్స్ తాలూకు వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఆది స్వరూపకే (Aadi Swaroopa) ఈ స్పెషల్ టాలెంట్ ఉంది. రెండు చేతులతో ఒకేసారి రాయడం, అందులోనూ 11 రకరకాల స్టైల్స్‌లో రాయగలగడమంటే నిజంగా సూపర్ టాలెంట్ అనే చెప్పాలి. ఆమె అలా రాస్తున్న వీడియోను రవి కర్కారా అనే ట్విటర్ యూజర్ పోస్ట్ చేశారు. "ఆమె బ్రెయిన్ లోని రెండు పార్టులూ ఒకే సమయంలో పనిచేయగలవు. ఇలాంటి వారు 10 లక్షల మందిలో ఒకరే ఉంటారు" అనే క్యాప్షన్‌తో ఆయన ఈ వీడియోను ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 20లక్షల మందికి పైగా వీక్షించారు. అలాగే 50వేలకు పైగా లైక్క్ వచ్చాయి. ఇకపోతే ఈ స్కిల్‌ని యాంబీడెక్స్‌టెరిటీ (Ambidexterity) అంటారని రవి కర్కారా పేర్కొన్నారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'వావ్.. నిజంగా నమ్మలేకపోతున్నా' అని ఒకరు, 'సూపర్.. నా పాలికేళ్ల టీచింగ్ కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు. ఆమె తన జీవితంలో చాలా దూరం వెళ్తుందని ఆశిస్తున్నా' అని మరోకరు కామెంట్ చేశారు.