Man Hole Dance: బాబోయ్.. ఏంటీ వింత..? నడిరోడ్డుపై మ్యాన్‌హోల్ మూత ఎందుకిలా పదే పదే పైకి లేస్తోందంటే..!

ABN , First Publish Date - 2023-09-11T17:45:27+05:30 IST

మ్యాన్ హోల్ మూత డ్యాన్స్ వేయడం మీరెప్పుడైనా చూశారా? దానంతట అదే పైకీ, కిందకూ కదలడం చూశారా? అయితే ఈ వీడియో చూడండి.. ఈ వీడియో చూశాకా మీరు షాక్ అవకుండా ఉండలేరు. వైరల్ అవుతున్న ఈ వీడియోను నార్వే రాజధాని ఓస్లోలో చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Man Hole Dance: బాబోయ్.. ఏంటీ వింత..? నడిరోడ్డుపై మ్యాన్‌హోల్ మూత ఎందుకిలా పదే పదే పైకి లేస్తోందంటే..!

మ్యాన్ హోల్ (Manhole) మూత డ్యాన్స్ వేయడం మీరెప్పుడైనా చూశారా? దానంతట అదే పైకీ, కిందకూ కదలడం చూశారా? అయితే ఈ వీడియో చూడండి.. ఈ వీడియో చూశాకా మీరు షాక్ అవకుండా ఉండలేరు. వైరల్ అవుతున్న ఈ వీడియోను నార్వే (Norway) రాజధాని ఓస్లోలో చిత్రీకరించారు. earthpix అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ (Viral Video) అవుతోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డుపై వేసిన పట్టాల పై నుంచి ట్రామ్ వెళ్తోంది. ఆ పట్టాల మధ్యలో ఉన్న మ్యాన్ హోల్ మూత (Manhole Cover dance) దానంతట అదే పైకీ, కిందకూ కదులుతోంది. దానిని చూసి డ్రైవర్ ట్రామ్‌ను ఆపేశాడు. ఎంతో బరువు ఉండే ఆ ఐరన్ మూత ఎందుకు అలా కదులుతోందో చాలా మందికి ఆర్థం కావడం లేదు. తుఫాను ప్రభావం వల్ల వేగంగా గాలులు వీస్తుండడంతోనే ఆ మూత అలా డ్యాన్స్ చేస్తోందని కొందరు చెబుతున్నారు. వేరే మ్యాన్ హోల్‌ లోపలకి ప్రవేశించిన గాలి (Wind) వేగానికి ఈ మ్యాన్ హోల్ ఇలా కదులుతోందని కొందరు అంటున్నారు.

Shocking Video: షాకింగ్ వీడియో.. రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రాక్టర్‌ను చోరీ చేయాలనుకుని.. దాని టైర్ కిందే పడిపోయాడు.. చివరకు..!

ఏదైమైనా ఈ విచిత్రమైన ఘటన చాలా మంది ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా వీక్షించారు. 80 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఇది ప్రకృతి శక్తి``, ``ఈ మ్యాన్‌హోల్ నుంచి గంటకు 175 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో గాలి వీస్తోంది``, ``ప్రకృతి ముందు ఏదైనా అల్పమే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-09-11T17:45:27+05:30 IST