Bank Robbery: సడన్‌గా బ్యాంకులోకి దూరిన ముసుగు ముఠా.. పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి రూ.18 కోట్లు కొట్టేశారు..
ABN , First Publish Date - 2023-12-02T11:40:24+05:30 IST
Bank Robbery in Manipur: మణిపూర్‌లో తాజాగా జరిగిన బ్యాంక్ దోపిడీ సినిమాల్లో కనిపించే సీన్‌ను తలపించింది. ముఖానికి మాస్కులతో సడన్‌గా బ్యాంకులోకి దూరిన ముసుగు ముఠా అక్కడి సిబ్బందికి పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి ఏకంగా రూ. 18కోట్లు దోచుకెళ్లింది.
Bank Robbery in Manipur: మణిపూర్‌లో తాజాగా జరిగిన బ్యాంక్ దోపిడీ సినిమాల్లో కనిపించే సీన్‌ను తలపించింది. ముఖానికి మాస్కులతో సడన్‌గా బ్యాంకులోకి దూరిన ముసుగు ముఠా అక్కడి సిబ్బందికి పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి ఏకంగా రూ. 18కోట్లు దోచుకెళ్లింది. మణిపూర్ రాష్ట్రం ఉఖ్రూల్ జిల్లాలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు (Punjab National Bank) లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉఖ్రూల్ సిటీ పరిధిలోని వ్యూవ్ల్యాండ్లో ఉండే పంజాబ్ నేషన్ బ్యాంక్ బ్రాంచీలో ఎప్పుడూ భారీ మొత్తంలో నగదు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచే జిల్లాలోని ఇతర బ్యాంకుల ఏటీఎంలకు డబ్బులు తరలిస్తుంటారు. ఈ విషయం దొంగలకు ముందే తెలుసు.
Metro Train Video: మెట్రోలో చిల్లర వేషాలే కాదండోయ్.. ఇలాంటివి కూడా జరుగుతుంటాయ్.. ఈ కుర్రాడు ఏం చేశాడో చూస్తే..!
అందుకే గురువారం రాత్రి బ్యాంక్ క్లోజింగ్ సమయమైన సాయంత్రం 5.30గంటలకు ఆ బ్రాంచీకి చేరుకున్నారు. ముఖానికి మాస్కులు, చేతిలో ఆధునాతన ఆయుధాలు పట్టుకుని 10 మంది ఒకేసారి సినిమాటిక్ స్టైల్లో బ్యాంకులోకి ప్రవేశించారు. అనంతరం అక్కడి సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను ఒక వాష్‌రూంలో బంధించారు. ఆ తర్వాత ఒక సీనియర్ ఆఫీసర్‌ను పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి.. సేఫ్‌లాకర్ ఓపెన్ చేయించారు. అందులో ఉన్న నగదు మొత్తం తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై బ్యాంక్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దోపిడీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, సీసీటీసీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ వాషూమ్ వెల్లడించారు. కాగా, దొంగలు పట్టుకెళ్లిన సొమ్ము సుమారు రూ. 18.80కోట్లు అని ఎస్పీ చెప్పారు.