Share News

Metro Train Video: మెట్రోలో చిల్లర వేషాలే కాదండోయ్.. ఇలాంటివి కూడా జరుగుతుంటాయ్.. ఈ కుర్రాడు ఏం చేశాడో చూస్తే..!

ABN , First Publish Date - 2023-12-02T09:46:23+05:30 IST

Metro Train Viral Video: ఇటీవల రైళ్లలో జరుగుతున్న సంఘటన తాలూకు వీడియోలు తరచూ వైరల్ అవుతున్నాయి. కొందరు వ్యూస్, లైక్స్ కోసం వింత పనులు చేస్తూ వీడియోలు తీసి నెట్టింట పెడుతున్నారు.

Metro Train Video: మెట్రోలో చిల్లర వేషాలే కాదండోయ్.. ఇలాంటివి కూడా జరుగుతుంటాయ్.. ఈ కుర్రాడు ఏం చేశాడో చూస్తే..!

Metro Train Viral Video: ఇటీవల రైళ్లలో జరుగుతున్న సంఘటన తాలూకు వీడియోలు తరచూ వైరల్ అవుతున్నాయి. కొందరు వ్యూస్, లైక్స్ కోసం వింత పనులు చేస్తూ వీడియోలు తీసి నెట్టింట పెడుతున్నారు. వాటిలో చాలావరకు యువత పిచ్చి పనులకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. ఇదే కోవలో తాజాగా మరో ట్రైన్ వీడియో కూడా నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే, ఈసారి వైరల్ అవుతున్న వీడియో పైన చెప్పుకున్న వాటికి భిన్నం అని చెప్పాలి. ఓ యువకుడు వృద్ధురాలి పట్ల చూపించిన మానవత్వం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సొంతవారికి ఏమైనా అయితేనే పట్టించుకోని ఈ కాలంలో కూడా ఇలా దయగుణం కలిగిన వారు ఉండడం చాలా గ్రేట్ అని ఆ యువకుడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Viral Video: భవిష్యత్తులో జరిగేది ఇదే.. అమెరికాలో ఈ భారతీయ యువతికి షాకింగ్ అనుభవం.. కారు ఎక్కగానే..!

'ఎక్స్' (ట్విట్టర్) లో వైరల్ అవుతున్న వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ఓ పెద్దావిడ మెట్రో రైలులో ప్రయాణిస్తోంది. అదే రైలులో ఇతర ప్రయాణికులు కూడా ఉన్నారు. అయితే, ఉన్నట్టుండి పెద్దావిడ చేతిలో పట్టుకున్న మిల్క్‌షేక్ గ్లాస్ కాస్తా, ఆమె చేజారి కిందపడిపోతుంది. దాంతో అందులోని ద్రవమంతా కిందపడిపోతుంది. అలా వృద్ధురాలి చేతిలోంచి గ్లాస్ కిందపడగానే ఆమె పక్కన కూర్చున్న ఓ యువతి టక్కున లేచి పక్కకు వెళ్లిపోతుంది. ఇక కిందపడిపోయి ద్రవాన్ని పెద్దావిడ క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అది చూసిన ఎదురుగా నిల్చున్న ఓ యువకుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన టీ-షర్ట్ తీసి, పెద్దావిడ పారబోసిన మిల్క్‌షేక్ ద్రవాన్ని క్లీన్ చేయడం మనం వీడియోలో చూడొచ్చు. అలాగే ఆమె పక్కనే కూర్చొని ఏం పర్లేదు అన్నట్టుగా ధైర్యం కూడా చెప్పాడు.

Bride: పగోడికి కూడా రాకూడని కష్టమిది.. పెళ్లయి 24 గంటలకు కూడా గడవకముందే వధువు చెవిన వరుడి మృత్యువార్త..!


దీన్నింతటినీ తోటి ప్రయాణికులలో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇప్పటివరకు వీడియోకు 24.9 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అలాగే 1.39లక్షల మంది లైక్ చేశారు. ఇక వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. 'ఇలాంటి వారిని చూసినప్పుడు మానవత్వం ఇంకా బతికే ఉందనిపిస్తుంది (యువకుడిని ఉద్దేశిస్తూ)' అని ఒకరు, 'ఈ ప్రపంచంలో ఇంకా మంచివారు ఉన్నారు' అని మరొకరు, 'నేను చూసిన వారిలో ది బెస్ట్ జెంటిల్‌మెన్' అని ఇంకొకరు కామెంట్ చేశారు.

Anju: ఆమె కనుక మా ఊరికి వస్తే ప్రాణాలతో వదిలి పెట్టం.. పాకిస్తాన్ నుంచి తిరిగొచ్చిన అంజూ సొంతూళ్లో పరిస్థితి ఇదీ..!

Updated Date - 2023-12-02T09:47:42+05:30 IST