Viral Video: వామ్మో.. చెట్టంత పొడవున్న అనకొండ.. భారీ కొండచిలువను చూసి షాకవుతున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2023-07-09T16:35:53+05:30 IST

సాధారణ వ్యక్తులు చిన్న చిన్న పాములను చూస్తేనే భయంతో వణికిపోతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా భయపడుతుంటారు. పాములు పట్టేవాళ్లు, ప్రొఫెషనల్స్ తప్ప మిగిలన వారెవరూ తమంతట తాముగా పాముల జోలికి వెళ్లరు.

Viral Video: వామ్మో.. చెట్టంత పొడవున్న అనకొండ.. భారీ కొండచిలువను చూసి షాకవుతున్న నెటిజన్లు!

సాధారణ వ్యక్తులు చిన్న చిన్న పాములను (Snakes) చూస్తేనే భయంతో వణికిపోతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా భయపడుతుంటారు. పాములు పట్టేవాళ్లు, ప్రొఫెషనల్స్ తప్ప మిగిలన వారెవరూ తమంతట తాముగా పాముల జోలికి వెళ్లరు. చిన్న పామును చూస్తేనే భయపడే వాళ్లకు ఓ భారీ అనకొండ (Anaconda) ఎదురైతే ఎలా ఉంటుంది. నేరుగా కాకపోయినా వీడియోలో చూసినా ఒళ్లు జలదరిస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Snake Videos).

Amrit Upadhyay అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ చెట్టుపైకి భారీ అనకొండ (Huge Python) పాకుతోంది. ఆ కొండ చిలువ చెట్టు (Tree) మొదలు నుంచి చివరి వరకు చాలా భారీగా ఉంది. చాలా నెమ్మదిగా అది చెట్టు పైకి పాకుతోంది. స్థానికుడు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ (Viral Video)గా మారింది. చాలా మంది ఆ అనకొండను చూసి భయపడుతున్నారు.

Viral Video: అయ్యో.. ఆ వరుడు అంటే వధువుకు ఇష్టం లేదా?.. పెళ్లి వేదిక మీద ఆమె ప్రవర్తన చూస్తే..

``అది నిజమైన పామా? గ్రాఫిక్సా?``, ``వామ్మో.. అది అనకొండ కంటే భారీగా ఉంది``, ``దాని నోటికి చిక్కితే తప్పించుకోవడం కష్టం``, ``భయానికి ప్రతిరూపంగా ఉంది`` అంటూ కొందరు కామెంట్లు చేశారు. ఆ వీడియో తీసిన వ్యక్తి ధైర్యానికి మెచ్చుకోవచ్చని మరికొందరు పేర్కొన్నారు.

Updated Date - 2023-07-09T16:35:53+05:30 IST