Medicines: క్వాలిటీ టెస్టులో 48 మెడిసిన్స్ ఫెయిల్.. ఆ మెడిసిన్స్ మీరు వాడుతున్నారా? లిస్ట్ ఇదే చెక్ చేసుకోండి..
ABN , First Publish Date - 2023-04-28T12:32:15+05:30 IST
నాణ్యత పరీక్షలో విఫలమైన మందుల(medicines)లో యాంటీ డయాబెటిక్(Anti-Diabetic), యాంటీబయాటిక్స్( Antibiotics), కాల్షియం(Calcium), ..
డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) మార్చిలో జరిపిన నాణ్యత డ్రగ్స్ పరీక్షలో 48 రకాల మందులు వైఫల్యం చెందినట్లు ప్రకటించింది. డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) విడుదల చేసిన మార్చి నెలవారీ జాబితాలో మొత్తం 1,497 మెడిసిన్ నమూనాలను పరీక్షించగా వాటిలో 48 రకాల మందులు నాణ్యతపరీక్షలో విఫలమైనట్లు ప్రకటించింది.
నాణ్యత పరీక్షలో విఫలమైన మందుల(medicines)లో యాంటీ డయాబెటిక్(Anti-Diabetic), యాంటీబయాటిక్స్( Antibiotics), కాల్షియం(Calcium), కార్డియాక్ డ్రగ్స్(Cardiac Drugs ఉన్నాయి. ఎపిలెప్సీ డ్రగ్ గబాపెంటిన్, హైపర్‌టెన్షన్ డ్రగ్ టెల్మిసార్టన్, యాంటీ డయాబెటీస్ డ్రగ్ కాంబినేషన్ గ్లిమెపిరైడ్, మెట్‌ఫార్మిన్, హెచ్‌ఐవీ డ్రగ్ రిటోనావిర్ వంటి కొన్ని ప్రముఖ మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
CDSCO నివేదిక ప్రకారం, ఈ మందులలో Lycopene Mineral Syrup వంటి మందులు కూడా ఉన్నాయి, వీటిని ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవే కాకుండా విటమిన్C ఇంజక్షన్(Vitamin C Injection), ఫోలిక్ యాసిడ్ ఇంజక్షన్ (Folic Acid Injection) అల్బెండజోల్(Albendazole), కౌశిక్ డాక్-500(Kaushik Dok-500), నికోటినామైడ్ ఇంజక్షన్(Nicotinamide Injection), అమోక్సానాల్+(Amoxanol Plus), ఆల్సిఫ్లోక్స్(Alciflox) వంటి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మందులు విటమిన్ లోపాన్ని సరిచేయడానికి, అధిక బీపీని నియంత్రణ, అలెర్జీ నివారణ, యాసిడ్‌ను నియంత్రించడం, ఫంగల్ ఇన్ఫెక్షన్లను తొలగించేందుకు ఉపయోగిస్తారు. ఎక్కువ వినియోగంలో ఉండే ఈ మందులలో ఓ ప్రముఖ కంపెనీకి చెందిన టూత్‌పేస్ట్ కూడా ఫెయిల్ అయినట్లు తేలింది.
జాబితాలో ప్రామాణిక నాణ్యత లేని, కల్తీ మందులు, వైద్య పరికరాలు(Medical Devices), కాస్మోటిక్స్(Cosmetics) ఉన్నాయి. CDSCO పరిశోధన నివేదికలో ఉత్తరాఖండ్‌లో 14, హిమాచల్ ప్రదేశ్‌లో 13, కర్ణాటక నుంచి 4, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి 2, గుజరాత్, మధ్యప్రదేశ్, సిక్కిం, జమ్మూ, పుదుచ్చేరి 1 చొప్పున పలు ఫార్మాకంపెనీలు ఈ ఔషధాలు తయారు చేయబడ్డాయి. కర్ణాటక యాంటీబయాటిక్స్ & ఫార్మాస్యూటికల్స్, ఉత్తరాఖండ్‌కు చెందిన సైనోకెమ్ ఫార్మాస్యూటికల్స్, హర్యానాకు చెందిన నెస్టర్ ఫార్మాస్యూటికల్స్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన JBJM పేరెంటరల్స్, సోలన్‌కు చెందిన రోనమ్ హెల్త్‌కేర్, ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్‌తో సహా ప్రైవేట్,పబ్లిక్ డ్రగ్ తయారీదారులు ఈ మందులను తయారు చేస్తారు.
నాణ్యత లేని మందుల తయారీ ఫార్మా కంపెనీలకు డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నోటీసులు జారీ చేసి వారి స్పందన కోరింది. ఫార్మా కంపెనీలపై విచారణ జరపాలని డ్రగ్ అధికారులను ఆదేశించారు. ఈ నాణ్యతలేని మందులను నిషేధించేందుకు చర్చలు జరుపుతోంది. వివిధ ఫార్మా కంపెనీల ఔషధాల నాణత్య తనిఖీలు కొన్ని నెలలకు CDSCO ద్వారా జరుగుతుంది. గతేడాది నవంబర్‌లో కూడా పరీక్షలు నిర్వహించగా అందులో దాదాపు 50 మందులు విఫలమయ్యాయి.