Chiranjeevi: రాజశేఖర్ చేసిన పనికి.. చిరు సెల్యూట్ చేశారు

ABN , First Publish Date - 2023-02-24T19:00:03+05:30 IST

రోడ్డుపై కుప్పకూలి పడిపోయిన ఓ యువకుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్ రాజశేఖర్‌ (Traffic Constable Rajasekhar)కు అభినందనలు వెల్లువెత్తున్నాయి. యువకుడిని కానిస్టేబుల్‌

Chiranjeevi: రాజశేఖర్ చేసిన పనికి.. చిరు సెల్యూట్ చేశారు
Megastar Chiranjeevi

రోడ్డుపై కుప్పకూలి పడిపోయిన ఓ యువకుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్ రాజశేఖర్‌ (Traffic Constable Rajasekhar)కు అభినందనలు వెల్లువెత్తున్నాయి. యువకుడిని కానిస్టేబుల్‌ రక్షించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శభాష్.. రాజశేఖర్ అంటూ నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపించారు. ఇటు కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా అభినందలు తెలియజేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన ట్విట్టర్ వేదికగా ట్రాఫిక్‌ కానిస్టేబుల్ రాజశేఖర్‌‌‌ను అభినందించారు. ఫ్రెండ్లీ పోలీస్‌ (Friendly Police)కు ట్రాఫిక్‌ కానిస్టేబుల్ రాజశేఖర్‌ ఉదాహరణ అంటూ కితాబిచ్చారు.

‘‘ఈరోజు చురుకుగా వ్యవహరించి, సమయానికి CPR అందించి.. ఒక ప్రాణాన్ని కాపాడిన సైబరాబాద్ (Cyberabad) ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ రాజశేఖర్‌కు నా సెల్యూట్. రాజశేఖర్‌గారు మీరు మీ కర్తవ్యాన్ని మించి.. సాటి మనిషిని కాపాడారు. మానవత్వంలోనూ, రక్షించడంలోనూ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ఉదాహరణగా నిలిచారు..’’ అని మెగాస్టార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. గతంలో కూడా లాక్‌డౌన్ సమయంలో లేడీ సబ్ ఇన్‌స్పెక్టర్ సుభశ్రీ నాయక్ (Lady Sub Inspector Subhasree Nayak) చూపిన చొరవకు చిరంజీవి ముగ్ధుడైన విషయం తెలిసిందే. ఆమెతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ప్రత్యేకంగా అభినందించారు కూడా. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ రాజశేఖర్‌‌‌కు సెల్యూట్ చేసి.. మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు.

ఇక చిరంజీవి (Chiranjeevi) చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. మంచి విషయాన్ని, మంచి చేసే వారిని అభినందించడంలో బాస్ (Boss) ఎప్పుడూ ముందుంటాడు అంటూ మెగాభిమానులు (Mega Fans) సంతోషం వ్యక్తం చేస్తూ.. రాజశేఖర్‌కు మేము కూడా సెల్యూట్ చేస్తున్నామనేలా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం చిరు చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. (Chiranjeevi Salute to Rajasekhar)


ఇవి కూడా చదవండి

*********************************

Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

Nagineedu: నాకస్సలు భయం లేదు.. నేనే రాజు, నేనే మంత్రి (OHRK Promo)

Meena: ‘శుభలగ్నం’ రీమేక్ చేస్తే చేయాలనుకున్నా.. కానీ?


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!

Madhumitha Sivabalaji: ‘ఊ అంటావా మావ.. ఉఊ అంటావా’.. స్టెప్పులతో అరాచకం

Updated Date - 2023-02-24T19:20:28+05:30 IST