Home » Police Constable
పెట్రోల్ పంపులు, గ్యాస్ రీఫిల్లింగ్ స్టేషన్లు, సూపర్ మార్కెట్ల వంటి ప్రదేశాలలో నగదు లావాదేవీలను నిలిపివేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. కొత్త సంవత్సరం నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. అయితే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
గంజాయి ముఠాలు పట్టుబడితే ఆ పోలీసులకు పండగే! పట్టుబడ్డ సరుకులోంచి కొంత దారి మళ్లించి సొమ్ము చేసుకుంటారు. కొన్ని నెలలుగా వారిది ఇదే పని! ఓ కేసులో పట్టుబడ్డ నిందితులను విచారించిన సమయంలో ఈ దందా బయటపడింది.
రాష్ట్రంలో ‘ఒకే పోలీస్’ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం వివిధ బెటాలియన్ పోలీసులతో పాటు వారి కుటుంబసభ్యులు, చిన్నారులు నిరసనలు చేపట్టారు.
తెలంగాణ స్పెషల్ పోలీ్‌స(టీజీఎస్పీ) బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్లు 24 గంటల పాటు ఉద్యోగాలంటూ ఇళ్లకు రావడం లేదని.. కనీసం మంచి, చెడుల సమయంలో సైతం సెలవులు ఇవ్వడం లేదని వారి కుటుంబ సభ్యులు వాపోయారు.
గౌరవప్రదమైన పోలీసు ఉద్యోగంలో ఉన్న తమ భర్తలను అధికారులు కూలీలుగా మార్చి, వేధింపులకు గురి చేస్తున్నారంటూ 17వ బెటాలియన్ పోలీసు కానిస్టేబుళ్ల భార్యలు, వారి కుటుంబ సభ్యులు గురువారం సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి, గద్వాల జిల్లా ఎర్రవల్లిలోని జాతీయ రహదారులపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
గంజాయి చోరీ కేసులో తనను బలిపశువు చేశారని ఆరోపిస్తూ ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో దసరా రోజే జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
దేశ రాజధాని ఢిల్లీ రహదారులపై మరో దారుణం చోటుచేసుకుంది. ఓ కారు అతివేగంగా పోలీసు కానిస్టేబుల్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. తలకు తీవ్ర గాయాలైన అతను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించాడు.
కష్టపడి పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్) ఉద్యోగాన్ని సాధించిన ఆ యువకుడు ఆన్లైన్ గేమ్స్‌కు బానిసై.. ఆ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకొని అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద ఆదివారం పోలీసులు భద్రతను పెంచారు.
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భార్య, అనుకోకుండా కారుతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం, ఎంతో కష్టపడి కట్టుకున్న ఇలు వరద ముంపునకు గురి కావడం.