Viral: మేడ మీద ఫ్రెండ్‌తో కలిసి కాఫీ తాగుతోంటే.. ఆకాశంలోంచి ఆ యువతి మీద పడిందో వింత వస్తువు.. అదేంటో తెలిసి..!
ABN , First Publish Date - 2023-07-18T16:40:00+05:30 IST
ఆ మహిళ తన స్నేహితురాలితో కలిసి మేడ పైకి వెళ్లింది.. ఇద్దరూ అక్కడ కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు.. ఇంతలో ఆకాశం నుంచి రాయి లాంటి వస్తువు ఆ మహిళపై పడింది.. ముందు దానిని గబ్బిలం లేదా పై కప్పు నుంచి రాలిన ఇటుక అనుకున్నారు.. ఆ తర్వాత పరిశీలించి చూసి అసలు విషయం తెలుసుకున్నారు..
ఆ మహిళ తన స్నేహితురాలితో కలిసి మేడ పైకి వెళ్లింది.. ఇద్దరూ అక్కడ కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు.. ఇంతలో ఆకాశం నుంచి రాయి లాంటి వస్తువు ఆ మహిళపై పడింది.. ముందు దానిని గబ్బిలం లేదా పై కప్పు నుంచి రాలిన ఇటుక అనుకున్నారు.. ఆ తర్వాత పరిశీలించి చూసి అసలు విషయం తెలుసుకున్నారు.. తమపై పడింది ఆకాశం నుంచి నేరుగా వచ్చిన ఉల్క (Meteorite) అని తెలుసుకుని షాకయ్యారు. ఫ్రాన్స్ (France)లోని షిర్మెక్‌లో ఈ సంఘటన జరిగింది.
షిర్మెక్‌కు చెందిన ఓ మహిళ తన స్నేహితురాలితో కలిసి టెర్రస్‌పై కాఫీ తాగుతుండగా ఆమెపై చిన్న పాటి ఉల్క పడింది (Meteorite Hits Woman). గాల్లో నుంచి అకస్మాత్తుగా పడిన ఆ వస్తువును ముందు గబ్బిలం లేదా రూఫ్ సిమెంట్ అనుకున్నారు. ఆ రాయిని మహిళ ముందుగా నిర్మాణ కూలీకి చూపించింది. అదేంటో అతడికి అర్థం కాలేదు. ఆ తర్వాత దానిని జియోలజిస్ట్ రెబ్మాన్‌కు వాటిని చూపించింది. పరిశీలించిన ఆయన ఆ రాయిని ఉల్కగా నిర్ధారించారు. ఐరన్, సిలికాన్‌తో కూడిన ఆ రాళ్లు అంతరిక్షం నుంచి భూమిపై పడి ఉండవచ్చని తెలిపారు.
Bachelor Cooking: బ్యాచులర్ కుర్రాళ్లూ.. బీ కేర్‌ఫుల్.. రూమ్‌లో వంట చేస్తోంటే.. సడన్‌గా పేలిన కుక్కర్.. చివరకు..!
ఆకాశం నుంచి రాలిపడే ఉల్కలు సాధారణంగా గాలిలో ఉండగానే మండిపోతాయి. నాసా (NASA) అంచనా ప్రకారం ప్రతిరోజు సుమారు 50 టన్నుల మేర ఉల్క పదార్థాలు భూమిపై పడతాయి. అయితే అవి నేరుగా మనుషులపై పడటం మాత్రం చాలా అరుదు. రికార్డుల ప్రకారం 1954లో అమెరికాలో ఒక ఇంటి పై ఉన్న మహిళపై 3.6 కిలోల బరువున్న ఉల్క పడింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.