Milk tea or Black tea: బ్లాక్ టీ బెస్టా..? పాలతో చేసిన టీ మంచిదా..? రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదంటే..!
ABN , First Publish Date - 2023-10-17T12:32:27+05:30 IST
భారతదేశంలో అధికశాతం మంది మిల్క్ టీ తాగుతుంటారు. అయితే బ్లాక్ టీ, మిల్క్ టీ లలో ఏది ఆరోగ్యానికి బెస్టంటంటే..
టీ చాలామంది జీవితంలో భాగమైపోయింది. ఉదయాన్నే టీ తాగందే ఏ పనీ మొదలుపెట్టనివారు ఎక్కువ. సాధారణంగానే చాలామంది టీ తాగగానే అప్పటివరకు ఉన్న బద్దకం తొలగిపోయి చురుగ్గా పనులలో మునిగిపోతుంటారు. అయితే అధికశాతం మంది మిల్క్ టీ తాగుతుంటారు. కొందరు బ్లాక్ టీ తాగుతారు. ఈ రెండు టీలలో ఏది ఆరోగ్యానికి మంచిదనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవమేమిటంటే.. మిల్క్ టీ కంటే బ్లాక్ టీనే ఆరోగ్యానికి చాలామంచిది. మిల్క్ టీ వల్ల కలిగే దుష్ప్రభావాలు, బ్లాక్ టీ వల్ల కలిగే ప్రయాజనాలు తెలుసుకుంటే..
మిల్క్ టీ వల్ల కలిగే దుష్ప్రభావాలు..(milk tea side effects)
పాలతో కలిపి తయారుచేసే టీ కడుపు ఉబ్బంరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు కారణం అవుతుంది. టీలో ఉండే కెఫీన్ శరీరాన్ని డీహైడ్రేట్ చేసి మలబద్దకం కలిగిస్తుంది. పాలలో సహజంగానే ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి కారణం అవుతాయి. పాలతో చేసిన టీని రోజులో ఎక్కువసార్లు తాగేవారు బరువు మీద నియంత్రణ కోల్పోతారు. టీ కు జోడించే చక్కెర కూడా దీనికి కారణం అవుతుంది.
పాలతో చేసిన టీ ఎక్కువ తాగితే మెదడులో రసాయన సమతుల్యత దెబ్బతింటుందట. ఇది ఆందోళన, ఇతర మానసిక రుగ్మతలకు కారణం అవుతుంది. గుండెల్లో మంట, ఎసిడిటీ, ఆమ్లత్వం, వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం వంటి సమస్యలకు కూడా పాలతో తయారుచేసిన టీ కారణం అవుతుంది.
Travelers: తరచూ ప్రయాణాలు చేసే అలవాటు ఉన్న వాళ్లు.. ఈ 10 వస్తువులను మాత్రం అస్సలు మర్చిపోరట..!
బ్లాక్ టీ ప్రయోజనాలు..(black tea benefits)
బ్లాక్ టీ అన్నిరకాల టీల కంటే బాగా ఆక్సీకరణ చెందుతుంది. రుచిలో కూడా ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇందులో ఉండే ఫాలీఫెనాల్స్ గుండె జబ్బులనుండి రక్షించే యాంటీఆక్సిడెంట్లలో ఒకటి. కరోనరీ ఆర్టరీ వ్యాధిని నయం చేయడంలోనూ, జీర్ణశయాంతర సమస్యలను పరిష్కరించడంలోనూ బ్లాక్ టీ బాగా ఉపయోగపడుతుంది. ఆస్తమా రోగులు బ్లాక్ టీ తాగితే ఉపశమనం ఉంటుంది. దీంట్లో కొలెస్ట్రాల్ ను తగ్గించే థెప్లావిన్స్ ఉంటాయి.
మెనోపాజ్ సమయంలో జీర్ణవ్యవస్థ సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. అలాగే రొమ్ము క్యాన్సర్, స్త్రీ జననేంద్రియ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ మొదలైనవి రాకుండా చేస్తుంది.
బ్లాక్ టీ తాగీతే జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. బ్లాక్ టీ లో ఉండే రసాయనాలు ఏకాగ్రతను, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి తగ్గించే గుణాలు ఉండటం వల్ల ఇది ఎముకల సాంద్రత పెంచుతుంది. ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.