Monkey Video: కోతి చేష్టలంటే ఇవేనేమో.. ఓ యువకుడు హాయిగా నిద్రపోతోంటే.. సైలెంట్‌గా గదిలోకి వచ్చి ఓ కోతి చేసిన నిర్వాకమిదీ..!

ABN , First Publish Date - 2023-04-05T18:27:30+05:30 IST

పాపం నిద్రపోతున్న యువకుడు ఈ కోతి నిర్వాకానికి ..

Monkey Video: కోతి చేష్టలంటే ఇవేనేమో.. ఓ యువకుడు హాయిగా నిద్రపోతోంటే.. సైలెంట్‌గా గదిలోకి వచ్చి ఓ కోతి చేసిన నిర్వాకమిదీ..!

అల్లరికి కేరాఫ్ అడ్రస్ గా కోతి(Monkey)ని చెబుతారు పెద్దలు. ఊరికే గొడవకు(Fight) దిగడం, ఏ కారణం లేకుండా రచ్చ(fuss) చేయడం కోతులు చేసే పని. అసలే వేసవి కాలం కదా కాస్త చల్లగాలి వస్తుందనే కారణంతో ఓ యువకుడు తలుపులు తీసి నిద్రపోయాడు. ఇంకేముంది సైలెంట్ గా గదిలోకి ప్రవేశించి తన ఆపరేషన్ మొదలెట్టింది వానరం. పాపం నిద్రపోతున్న యువకుడు ఈ కోతి నిర్వాకానికి ఎన్ని ముప్పుతిప్పలు పడ్డాడో.. కోతి చేసిన ఘనకార్యానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఓ కుర్రాడు తన గదిలో దుప్పటి కప్పుకుని హాయిగా నిద్రపోతున్నాడు(Young man sleeping in his room). అసలే వేసవి కాలం కదా అందుకే కొంచెం తలుపులు తెరచే పడుకున్నాడు. అది వానరాల రాజ్యం కాబోలు.. ఓ వానరం(Monkey) అతడి గదిలోకి ప్రవేశించింది. అది నేరుగా అతని దగ్గరకు వెళ్ళి అతని పైకి ఎక్కి దుప్పటి(Blanket) లాగింది. తన దుప్పటి లాగుతున్నది ఎవరో మొదట కుర్రాడికి అర్థం కాలేదు, కానీ కోతి బలంకొద్దీ దుప్పటి లాగుతుంటే అతను ముఖం మీద దుప్పటి తొలగించి చూశాడు. కోతి దుప్పటి లాగుతూ కనిపించేసరికి ఒక్కసారిగా గతుక్కుమన్నాడు. వేగంగా పక్కనే ఉన్న దుడ్డుకర్ర(stick) తీసుకుని దాన్ని అదిలించాడు.

అసలే అది గండు కోతిలా ఉంది. అతను కర్రతో అదిలిస్తూంటే అదింకా రెచ్చిపోయింది. వెనక్కు వెళ్ళిన్టటే వెళ్ళి వేగంగా అతని మీద దాడికి దూకింది. కర్రతో నిజంగానే కొట్టేస్తాడేమో అనే ఆవేశంతో అతను, అతని మీద పడి అతన్ని రక్కేస్తుందేమో అనేంతగా కోతి.. ఇలా ఇద్దరి మధ్య ఓ రేంజ్ లో పైటింగ్ జరిగింది. కోతి ఏకంగా గోడ మీదకు ఎగిరి అతని మీదకు లంఘించింది. అది అలా మీదకు వస్తుంటే పాపం కుర్రాడు బెదిరిపోయాడు. దాని బారినుండి తప్పించుకోవడానికి తన శాయాశక్తులా ప్రయత్నించాడు. ఈ కుర్రాడికి, కోతికి మధ్య జరిగిన ఫైట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. rishbkaushik అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'వామ్మో ఈ కోతి ఏంటి ఇలా రెచ్చిపోయింది?' అని అన్నారు. 'ఆ కుర్రాడు అంత అదిలిస్తున్నా పోలేదంటే ఆ కోతి దౌర్జన్యం బాగా అర్థమవుతోంది' అని మరికొందరు కామెంట్ చేశారు. 'మొత్తానికి ఈ కోతి రచ్చ చేసి కానీ అక్కడి నుండి కదిలినట్టు లేదు' అని అంటున్నారు.

Read also: Viral Video: తెలివంటే నీదే బ్రదరూ.. చేతి పంపును అస్సలు ముట్టుకోకుండా నీళ్లను ఎలా బయటకు రప్పించాడో మీరే చూడండి..!


Updated Date - 2023-04-05T18:27:30+05:30 IST