Viral Video: ఈ వీడియో చూస్తే కన్నీళ్లు రాకమానవు.. మొసలి బారి నుంచి బిడ్డను కాపాడేందుకు ప్రాణత్యాగం.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2023-08-12T11:12:25+05:30 IST

దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. అందుకే బిడ్డను సురక్షితంగా ఉంచేందుకు తల్లి ఎంతటి ప్రమాదానికైనా ఎదురువెళ్తుంది. అవసరమైతే తన ప్రాణాన్ని అయినా త్యాగం చేస్తుంది. మనుషుల్లోనే కాదు.. జంతువుల్లో కూడా పిల్లల పట్ల ప్రేమ తీవ్రస్థాయిలోనే ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో ఆ విషయాన్ని రుజువు చేస్తోంది.

Viral Video: ఈ వీడియో చూస్తే కన్నీళ్లు రాకమానవు.. మొసలి బారి నుంచి బిడ్డను కాపాడేందుకు ప్రాణత్యాగం.. వీడియో వైరల్!

దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను (Mother) సృష్టించాడంటారు. అందుకే బిడ్డను సురక్షితంగా ఉంచేందుకు తల్లి ఎంతటి ప్రమాదానికైనా ఎదురువెళ్తుంది. అవసరమైతే తన ప్రాణాన్ని అయినా త్యాగం చేస్తుంది. మనుషుల్లోనే కాదు.. జంతువుల్లో కూడా పిల్లల పట్ల ప్రేమ తీవ్రస్థాయిలోనే ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) ఆ విషయాన్ని రుజువు చేస్తోంది. ఆ వీడియోలో ఓ జింక (Deer) తన బిడ్డను కాపాడుకునేందుకు తనను తాను మొసలి (Crocodile)కి అర్పించుకుంది.

horrors అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ జింక పిల్ల (Fawn) నదిలోకి వెళ్తోంది. ఆ జింక పిల్లను గమనించిన ఓ మొసలి దానిని పట్టుకునేందుకు వేగంగా ముందుకు దూసుకువస్తోంది. తన బిడ్డను తినేందుకు మొసలి వస్తున్నట్టు గమనించిన తల్లి జింక (Mother Deer) రంగంలోకి దిగింది. వేగంగ ఈదుకుంటూ మొసలికి, తన బిడ్డకు మధ్యలోకి వచ్చి ఆగిపోయింది. దీంతో ఆ మొసలి తల్లిజింకను పట్టుకుని వెళ్లిపోయింది.

Viral: ర్యాపిడో బుక్ చేస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద వచ్చిన రైడర్.. అతడెవరో తెలుసుకుని షాకైన టెకీ!

తన బిడ్డను కాపాడుకునేందుకు జింక చేసిన ప్రాణత్యాగం ఎంతో మందిని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆ ఎమోషనల్ వీడియో (Emotional Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిలియన్ల మంది ఆ వీడియోను చూశారు. లక్ష మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ``ఈ వీడియో చూశాక నా హృదయం ముక్కలైంది``, ``బిడ్డ కోసం తల్లి ఏం చేయడానికైనా వెనుకాడదు``, ``ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులందరికీ నా వందనాలు`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-08-12T11:12:25+05:30 IST