Viral Video: మనసుకు ఆహ్లాదం కలిగించే వీడియో.. బిడ్డకు తొలి అడుగులు నేర్పుతున్న తల్లి ఏనుగు.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2023-08-18T13:04:19+05:30 IST

ఈ సృష్టిలో చాలా జీవులకు తల్లే తొలి గురువు. గర్భంలో నుంచి బిడ్డ భూమి మీదకు వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు నేర్పుతుంది. బిడ్డ తొలి అడుగులు నేర్చుకునేది కూడా తల్లి సమక్షంలోనే. మనుషులే కాదు.. జంతువులు కూడా తల్లి సమక్షంలోనే తొలి అడుగులు నేర్చుకుంటాయి.

Viral Video: మనసుకు ఆహ్లాదం కలిగించే వీడియో.. బిడ్డకు తొలి అడుగులు నేర్పుతున్న తల్లి ఏనుగు.. వీడియో వైరల్!

ఈ సృష్టిలో చాలా జీవులకు తల్లే (Mother) తొలి గురువు. గర్భంలో నుంచి బిడ్డ భూమి మీదకు వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు నేర్పుతుంది. బిడ్డ తొలి అడుగులు నేర్చుకునేది కూడా తల్లి సమక్షంలోనే. మనుషులే కాదు.. జంతువులు (Animals) కూడా తల్లి సమక్షంలోనే తొలి అడుగులు నేర్చుకుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఏనుగు (Elephant Video) తన బిడ్డకు అడుగులు నేర్పుతోంది. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను ఎంతగానో ఆకట్టుకుంటోంది (Viral Video).

Latest Sightings అనే యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియో షేర్ అయింది. అప్పుడే పుట్టిన ఏనుగు పిల్ల నిలబడడానికి ప్రయత్నిస్తోంది. నిలబడలేక కింద పడిపోతోంది. అప్పుడు తల్లి ఏనుగు తన బిడ్డకు ఆసరాగా నిలిచింది (Elephant teaches her child to walk). ఆ తర్వాత దానికి తొలి అడుగులు నేర్పుతోంది. ఫీల్డ్ గైడ్ బ్రెట్ మార్నెవెక్ ఆ దృశ్యాన్ని వీడియో తీశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా వీక్షించారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Viral Video: వామ్మో.. కాకి జీవితం ఇలా ఉంటుందా? వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో.. నెటిజన్ల రియాక్షన్లు ఏంటంటే..

``నవజాత శిశువు నిలబడడానికి చేస్తున్న పోరాటం తల్లికి ఎంతో సంతోషం కలిగిస్తుంది``, ``ఏ జీవి అయినా తొలి అడుగుల వేయాలంటే తల్లి అండ ఉండాల్సిందే``, ``చాలా ఆహ్లాదకరమైన వీడియో``, ``ఏనుగుల వీడియోలు చాలా అద్భుతంగా ఉంటాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-08-18T13:04:19+05:30 IST