Mother: ఏడాదిన్నర బాబును నిద్రపుచ్చి.. పక్కింటి మహిళతో ముచ్చట్లు.. 2 గంటలైనా ఏడవడం లేదేంటని వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2023-07-22T15:47:57+05:30 IST

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికేం తెలియదు కాబట్టి అనుక్షణం కనిపెట్టుకుని ఉండాలి. వారికి ఊహ తెలిసే వరకు వారిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. లేకపోతే అమాయక చిన్నారులు చేయకూడని పనులు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో అలాంటి ఘటనే జరిగింది.

Mother: ఏడాదిన్నర బాబును నిద్రపుచ్చి.. పక్కింటి మహిళతో ముచ్చట్లు.. 2 గంటలైనా ఏడవడం లేదేంటని వెళ్లి చూస్తే..

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికేం తెలియదు కాబట్టి అనుక్షణం కనిపెట్టుకుని ఉండాలి. వారికి ఊహ తెలిసే వరకు వారిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. లేకపోతే అమాయక చిన్నారులు చేయకూడని పనులు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని గోరఖ్‌పూర్‌లో అలాంటి ఘటనే జరిగింది. ఆ చిన్నారి తల్లి (Mother) పక్కింటి మహిళతో మాట్లాడి వచ్చే లోపు ఆ చిన్నారి బకెట్లో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఆ విషాదకర ఘటన స్థానికంగా సంచలనంగా మారింది (Crime News).

గోరఖ్‌పూర్‌కు సమీపంలోని బనౌలీ గ్రామానికి చెందిన గుడ్డు యాదవ్ దంపతులకు ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. శుక్రవారం మధ్యాహ్నం కొడుకుని నిద్రపుచ్చిన తర్వాత గుడ్డు యాదవ్ భార్య పక్కింటి మహిళతో ముచ్చట్లు పెట్టింది. దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉండిపోయింది. ఆమె తిరిగి వచ్చే సరికి పక్క మీద బాబు కనిపించలేదు. ఇల్లంతా వెతికినా ఎక్కడా చిన్నారి ఆచూకీ కనిపించలేదు. చివరకు బాత్రూమ్‌లోని బకెట్‌లో ఆ చిన్నారి మృతదేహం కనిపించింది (child drowned in a tub).

Viral Video: కాపాడినందుకు థ్యాంక్స్.. బావిలో పడిన ఏనుగును కాపాడిన సిబ్బంది.. వీడియో వైరల్!

బాత్రూమ్‌లోని బకెట్‌లో తలకిందులుగా పడిన బాలుడు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లైన ఆరేళ్ల తర్వాత పుట్టిన కుమారుడు అలా ప్రమాదవశాత్తూ మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అజాగ్రత్తగా ఉండి కుమారుడి చావుకు కారణమైన గుడ్డు యాదవ్ భార్యను అందరూ నిందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Updated Date - 2023-07-22T15:47:57+05:30 IST