Shocking Crime: చెల్లెలి తల నరికేసిన అన్న.. మధ్యప్రదేశ్‌లో షాకింగ్ క్రైమ్.. ఆ అన్న ఆగ్రహానికి కారణమేంటంటే..
ABN , First Publish Date - 2023-10-14T18:46:39+05:30 IST
మధ్యప్రదేశ్‌లో షాకింగ్ క్రైమ్ జరిగింది. ఓ వ్యక్తి కత్తితో తన స్వంత చెల్లెలి తల తెగనరికాడు. ఇంట్లోనే ఆ దారుణానికి తెగబడ్డాడు. ఆ చెల్లి చేసిన పనికి తీవ్ర ఆగ్రహానికి గురైన అన్న అత్యంత కర్కశంగా వ్యవహరించాడు. వివాహిత అయిన సోదరి భర్తను వదిలేసి ముస్లిం మతానికి చెందిన వ్యక్తితో వెళ్లిపోవడమే ఆ అన్న ఆగ్రహానికి కారణం.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో షాకింగ్ క్రైమ్ జరిగింది. ఓ వ్యక్తి కత్తితో తన స్వంత చెల్లెలి తల తెగనరికాడు. ఇంట్లోనే ఆ దారుణానికి తెగబడ్డాడు. ఆ చెల్లి చేసిన పనికి తీవ్ర ఆగ్రహానికి గురైన అన్న అత్యంత కర్కశంగా వ్యవహరించాడు (Brother killed Sister). వివాహిత అయిన సోదరి భర్తను వదిలేసి ముస్లిం మతానికి చెందిన వ్యక్తితో వెళ్లిపోవడమే ఆ అన్న ఆగ్రహానికి కారణం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది (Crime News).
మధ్యప్రదేశ్‌లోని బరోడ్ గ్రామానికి చెందిన బగ్డు (26) అనే యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. బగ్డు సోదరి 24 ఏళ్ల రేఖ (అసలు పేరు కాదు)కు నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. వివాహం తర్వాత ఆమె ముస్లిం మతానికి చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. రెండేళ్ల క్రితం భర్తను వదిలేసి అతడితో వెళ్లిపోయింది. రెండేళ్లుగా అతడితోనే కలిసి జీవిస్తోంది. చెల్లి చేసిన పనికి గ్రామంలో పరువు పోయిందని బగ్డు సోదరి మీద కక్ష పెంచుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూశాడు.
IND vs PAK: డియర్ పాకిస్థానీ ఫ్యాన్స్.. మీ టీవీలు జాగ్రత్త.. ఇండియా, పాక్ మ్యాచ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్!
మూడ్రోజుల క్రితం రేఖ తన తల్లిదండ్రులను చూడడానికి బరోడ్ గ్రామానికి వెళ్లింది. రెండ్రోజులు తల్లిదండ్రులతో సరదాగా గడిపింది. మూడో రోజు తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బగ్డు తన పగ తీర్చుకున్నాడు. ఓ కత్తితో చెల్లెలి తల నరికేశాడు. బయటి నుంచి వచ్చిన తండ్రి కూతురి మృతదేహాన్ని చూసి షాకయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బగ్డును అదుపులోకి తీసుకున్నారు.