Viral Video: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న వీడియో.. సమాధిలోకి వెళ్లి మరీ ఓ యూట్యూబర్ రిస్కీ స్టంట్..!
ABN , First Publish Date - 2023-11-22T15:40:14+05:30 IST
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొంత మంది వ్యక్తులు సంయమనం కోల్పోతున్నారు. ఎలాగైనా పాపులారిటీ సంపాదించేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. విచిత్ర విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. అయితే తాజాగా ఓ యూట్యూబర్ చేసిన పని మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొంత మంది వ్యక్తులు సంయమనం కోల్పోతున్నారు. ఎలాగైనా పాపులారిటీ సంపాదించేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. విచిత్ర విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. అయితే తాజాగా ఓ యూట్యూబర్ (Youtuber) చేసిన పని మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. మిస్టర్ బీస్ట్ (Mr Beast) అనే యూట్యూబర్ తనను తాను సజీవ సమాధి చేసుకున్నాడు. ఏడు రోజుల పాటు భూమికి పది అడుగుల లోతులో శవ పేటికలో గడిపాడు (Burial Stunt).
మిస్టర్ బీస్ట్‌గా పాపులర్ అయిన జిమ్మీ డొనాల్డ్‌సన్ యూట్యూబర్‌గా బాగా ఫేమస్. అతడి యూట్యూబ్ ఛానెల్‌కు ఏకంగా 212 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. వారిని అలరించడానికి మిస్టర్ బీస్ట్ రకరకాల పనులు చేసి ఆ వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా ఏడు రోజుల పాటు తనను తాను సజీవ సమాధి చేసుకోవాలని భావించాడు (Seven days in a coffin). మొదట బీస్ట్‌ను అత్యాధునిక పారదర్శక శవపేటికలో పెట్టారు. ఈ పేటికలో ఆహారం, నీరు, వీడియో రికార్డింగ్ కోసం కెమెరాలు అమర్చారు. తర్వాత ఆ శవ పేటికను 10 అడుగుల లోతు ఉన్న గొయ్యిలో దించారు. ఎక్స్‌కవేటర్‌తో శవపేటిక పైన 20,000 పౌండ్ల మట్టిని చల్లారు (Shocking Video).
Bathroom: ఓరి దేవుడో.. బాత్రూంలోకి వీటినెందుకు తెచ్చారయ్యా బాబూ.. తలపట్టుకుంటున్న నెటిజన్లు..!
తన బృందంతో మాట్లాడడానికి బీస్ట్ వాకీ-టాకీని ఉపయోగించాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏడు రోజుల పాటు ఒక్కడే కదలకుండా అలా శవపేటికలో పడుకుని ఉండడం అంటే మాటలు కాదు. ఆ ఏడు రోజుల్లో పలు సందర్భాల్లో బీస్ట్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏడు రోజుల పాటు అలాగే, కదలకుండ చిన్న డబ్బాలో ఉండడం వల్ల అతడి కాళ్లలో రక్తం గడ్డకట్టింది. పేటిక నుంచి బయటకు తీసినపుడు నిలబడలేకపోయాడు. అయితే అదృష్టవశాత్తూ అంతకుమించి ఎలాంటి ఆరోగ్య, మానసిక సమస్యలు తలెత్తలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. మూడు రోజుల్లోనే 70 మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు.