మీరు కొనుగోలు చేసే కర్బూజా తీపిగా ఉందో లేదో తెలుసుకోవాలంటే.. ఈ ఒక్క పని చేయండి చాలు!
ABN , First Publish Date - 2023-04-18T06:56:19+05:30 IST
Tips to buy sweet muskmelon: కర్బూజా ఫలం వేసవిలో విరివిగా లభిస్తుంది. అయితే దీనిని కొనుగోలు చేసేముందు అది తీపిగా ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Tips to buy sweet muskmelon: కర్బూజా ఫలం వేసవిలో విరివిగా లభిస్తుంది. అయితే దీనిని కొనుగోలు చేసేముందు అది తీపిగా ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనిని గుర్తించేందుకు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కర్బూజా(muskmelon) కొనుగోలు చేసేముందు దాని దిగువ భాగాన్ని గమనించండి. అక్కడ డార్క్‌గా ఉంటే అది తీపిగా ఉంటుందని, సహజంగా పండినదని గుర్తుంచుకోండి. కర్బూజా పైభాగం పసుపు రంగులో ఉండి, దానిపై పచ్చని చారలు(Green stripes) కనిపిస్తే అది రుచికి తియ్యగా ఉంటుంది.
కర్బూజా కింది భాగం సాధారణంగానే ఉంటే దానిని అస్సలు కొనకండి. దానిని రసాయనాలు(Chemicals) ఉపయోగించి వండించి ఉంటారని గుర్తించండి. ఎక్కువ బరువు ఉన్న కర్బూజా లోపల ఎక్కువ గింజలు ఉంటాయి. అది పూర్తి స్థాయిలో పండివుండకపోవచ్చని గుర్తించండి. ఎప్పుడూ తక్కువ బరువున్న కర్బూజాను మాత్రమే కొనుగోలు చేయండి. పుచ్చకాయ దిగువభాగం ముదురు రంగు(dark color)లో ఉంటే, అది సహజంగా పండినదని, అది తీపిగా ఉంటుందనే విషయం గుర్తించండి. కర్బూజా పైనుండి పచ్చగా ఉంటే అది రుచికి చప్పగా ఉంటుంది.
పుచ్చకాయ నుంచి వచ్చే సువాసన కూడా అది తీపిగా(sweetly) ఉందని తెలియజేస్తుంది. బాగా పండిన కర్బూజాను అస్సలు కొనుగోలు చేయవద్దు. అటువంటి పుచ్చకాయ లోపల నుండి కుళ్ళిపోవచ్చు. దీనిని తెలుసుకునేందుకు కర్బూజాను మెల్లగా నొక్కి గమనించండి.