Indore: ముస్లిం అమ్మాయి, హిందూ యువకుడు కలిసి హోటల్‌కు డిన్నర్‌కు వచ్చారు...ఆపై ఏం జరిగిందంటే...
ABN , First Publish Date - 2023-05-27T08:22:55+05:30 IST
ఇండోర్‌లో ముస్లిం అమ్మాయి, హిందూ యువకుడు విందు కోసం హోటల్‌కు వచ్చారు. ముస్లిం యువతి, హిందూ యువకుడు హోటల్ నుంచి బయటకు రాగానే వారిని దుండగులు కొట్టారు....
ఇండోర్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ఓ ఘటన కత్తిపోట్లకు దారి తీసింది.ఇండోర్‌లో ముస్లిం అమ్మాయి, హిందూ యువకుడు విందు కోసం హోటల్‌కు వచ్చారు. ముస్లిం యువతి, హిందూ యువకుడు హోటల్ నుంచి బయటకు రాగానే వారిని దుండగులు కొట్టారు.ముస్లిం యువతితో వచ్చిన హిందూ యువకుడిని ఓ గుంపు వెంబడించి వారిని చుట్టుముట్టింది.(Muslim girl, Hindu boy) ఆ జంటను రక్షించిన ఇద్దరిని ఆగంతకులు కత్తితో పొడిచారు.(Dinner manhandled by Indore mob) ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వేరే మతానికి చెందిన వ్యక్తితో ఎందుకు వచ్చావని మహిళను ఆగంతకులు ప్రశ్నించినట్లు అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ రఘువంశీ తెలిపారు.
‘‘తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి తాను ఆ వ్యక్తితో కలిసి డిన్నర్ చేయడానికి వచ్చానని మహిళ చెప్పింది. గుంపు ప్రవర్తనపై ముస్లిం యువతి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంతలో జంటను రక్షించడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను గుంపు నుంచి ఎవరో కత్తితో పొడిచడంతో గాయపడ్డారు.’’ అని అదనపు డీసీపీ తెలిపారు.ఈ ఘటనపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307కింద కేసు నమోదు చేశామని, ఇప్పటివరకు ఏడుగురు నిందితులను గుర్తించామని తుకోగంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కమలేష్ శర్మ తెలిపారు.జంటను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోలీసులను ఆదేశించారు.