Mysterious Object: ఏంటీ వింత వస్తువు..? శాస్త్రవేత్తలకే అంతుచిక్కని మిస్టరీ..!
ABN , First Publish Date - 2023-07-18T20:59:08+05:30 IST
ఆస్ట్రేలియా బీచ్‌లో కనిపిస్తున్న ఓ వింత వస్తువు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సముద్రం నుంచి కొట్టుకువచ్చిన ఆ మిస్టరీ వస్తువు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ వింత వస్తువు చంద్రయాన్-3ని తీసుకెళ్లిన ఎల్వీఎం రాకెట్‌కు సంబంధించిన శకలమని చాలా మంది భావిస్తున్నారు.
ఆస్ట్రేలియా బీచ్ (Australian beach)లో కనిపిస్తున్న ఓ వింత వస్తువు (Mysterious Object) అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సముద్రం నుంచి కొట్టుకువచ్చిన ఆ మిస్టరీ వస్తువు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ వింత వస్తువు చంద్రయాన్-3 (Chandrayaan-3)ని తీసుకెళ్లిన ఎల్వీఎం రాకెట్‌కు సంబంధించిన శకలమని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఆ వస్తువు ఏంటనే విషయంలో మాత్రం ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. ఆస్ట్రేలియాలోని జురియన్ బే బీచ్‌లో మిస్టరీ వస్తువు స్థానికులకు కనిపించింది.
పశ్చిమ ఆస్ట్రేలియా(Australia)లోని గ్రీన్ హెడ్ పట్టణ తీరంలో ఉన్న బీచ్‌కు కొట్టుకు వచ్చిన ఆ వస్తువు ఏంటని స్థానిక అధికారులు విచారిస్తున్నారు. అది ఎక్కడ్నుంచి వచ్చింది? ప్రమాదకరమా? కాదా? అని తేల్చే పనిలో పడ్డారు. ఆ మిస్టరీ వస్తువుకు దూరంగా ఉండాలని స్థానికులకు సూచించారు. మిస్టరీ వస్తువుపై ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ (Australia Space Agency) కూడా దర్యాప్తు ప్రారంభించింది. అది విదేశీ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన వస్తువు అయి ఉంటుందని ఓ అంచనాకు వచ్చింది. ఆ వస్తువుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ ట్వీట్ చేసింది.
Dubai Ruler: ఓ భారతీయ కుటుంబానికి షాకింగ్ అనుభవం.. ఇక్కడేం చేస్తున్నారంటూ దుబాయి రాజే వచ్చి పలకరించడంతో..!
భారతదేశం ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్-3ని తీసుకెళ్లిన ఎల్వీఎం రాకెట్ (ISRO rocket)కు సంబంధించిన శకలంగా దానిని భావిస్తూ చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. చంద్రయాన్-3 ఆస్ట్రేలియా గగనతలం మీద నుంచి వెళ్లింది అంటూ ఇటీవల కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. . అయితే, ఈ వస్తువు ఏంటనే విషయంలో మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు.