Beggars: బిచ్చగాళ్లకు భారీ షాక్.. ఇకపై ఆ సిటీలో ఎవరైనా అడుక్కుంటే కేసులు పెట్టి జైల్లో వేస్తామంటూ పోలీసుల హెచ్చరిక..!

ABN , First Publish Date - 2023-03-09T18:02:27+05:30 IST

కనీస అవసరాలు తీర్చుకోలేని బీదవాళ్లు భారత్‌లో (India) అనేక మంది ఉన్నారు. ఇక దివ్యాంగుల పరిస్థితి మరీ దారుణం. ఏ పనులు చేసుకోలేని అంగవైకల్యం కారణంగా కొంత మంది భిక్షాటన

Beggars: బిచ్చగాళ్లకు భారీ షాక్.. ఇకపై ఆ సిటీలో ఎవరైనా అడుక్కుంటే కేసులు పెట్టి జైల్లో వేస్తామంటూ పోలీసుల హెచ్చరిక..!
పోలీసుల హెచ్చరిక..!

కనీస అవసరాలు తీర్చుకోలేని బీదవాళ్లు భారత్‌లో (India) అనేక మంది ఉన్నారు. ఇక దివ్యాంగుల పరిస్థితి మరీ దారుణం. ఏ పనులు చేసుకోలేని అంగవైకల్యం కారణంగా కొంత మంది భిక్షాటన చేస్తుంటారు. దీంతో నగరాల్లో రద్దీ కూడళ్ల దగ్గర యాచిస్తుంటారు. ఇప్పుడు వారి వృత్తిపై పొట్టకొట్టారు నాగ్‌పూర్ పోలీసులు. గతిలేక అడుక్కుంటుంటే అధికారులు వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. రోడ్లపై కనిపిస్తే ఇకపై కేసులు పెట్టి జైల్లో పెడతామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు వారి దయనీయ పరిస్థితి చూసి జీవనోపాధి కల్పించాల్సింది పోయి.. వారి వృత్తికి గండి కొడుతున్నారు. ఇకపై రోడ్లపై అడుక్కుంటే అడ్డంగా బుక్ చేసి కేసులు పెట్టి జైల్లో పెడతామని వార్నింగ్ ఇచ్చారు.

కొన్ని నగరాల్లో కొంత మంది యాచకులు శృతిమించి ప్రవర్తించడం వల్ల వారి వృత్తికి ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి. కొందరి తీరుతో విసిగి చెందిన పౌరులు కూడా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో భిక్షగాళ్లపై (Beggars) చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు నాగ్‌పూర్‌ (Nagpur) పోలీసులు స్పెషల్ రైడ్స్ (Special Rides) చేయడం ప్రారంభించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ (Traffic signals), రోడ్ల పక్కనే కాకుండా ముఖ్యమైన బహిరంగ ప్రదేశాల్లో నిలబడి అడుక్కోవడం సాధ్యం కాదని హెచ్చరించారు. చౌరస్తాల్లో బిచ్చగాళ్లపై కేసు నమోదు చేయాలని పోలీసు కమిషనర్ అమితేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జీ-20 (G-20) నేపథ్యంలో పోలీస్ కమిషనర్ ఈ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే చాలా మంది యాచకులను నగరం నుంచి తరిమికొట్టారు. చౌరస్తాల్లో జరుగుతున్న ఇబ్బందులను అదుపులోకి తెచ్చేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Tent boy: 10 ఏళ్ల బాలుడు.. రోజూ టెంటులో నిద్రపోయి ఏకంగా రూ.7 కోట్లు కూడబెట్టాడు..!

Updated Date - 2023-03-09T18:02:27+05:30 IST