చివరిరోజుల్లో తల్లిని చూసుకోలేకపోయినందుకు ఇతను తీసుకున్న నిర్ణయం తెలిసి నెటిజన్ల షాక్.. ఏం చేశాడంటే..
ABN , First Publish Date - 2023-02-28T17:34:27+05:30 IST
ఈ కమర్షియల్ రోజుల్లో తల్లిదండ్రులను భారంగా చూసేవాళ్ళే ఎక్కువ. తన తల్లి చివరిరోజులలో దగ్గరుండి చూసుకోలేకపోయాననే బాధతో
తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ సహజం. అయితే తల్లిదండ్రులను ప్రేమించే పిల్లలు చాలా తక్కువనే చెప్పాలి. ఈ కమర్షియల్ రోజుల్లో తల్లిదండ్రులను భారంగా చూసేవాళ్ళే ఎక్కువ. తన తల్లి చివరిరోజులలో దగ్గరుండి చూసుకోలేకపోయాననే బాధతో ఓ వ్యక్తి ఆశ్చర్యపోయే నిర్ణయం తీసుకున్నాడు. ఇతని నిర్ణయం విన్న నెటిజన్లు షాకవుతున్నారు. ఇంతకూ ఇతను తీసుకున్న నిర్ణయం ఏంటి? అందరూ ఎందుకు షాక్ అవుతున్నారు తెలుసుకుంటే..
మహారాష్ట్ర(Maharastra) రాష్ట్రంలో ఔరంగాబాద్(Aurangabad) అనే పట్టణం ఉంది. ఇది జిల్లా కేంద్రం కూడా. ధనరాజ్ హజారే అనే వ్యక్తిది ఔరంగాబాద్. కానీ ఇతను తన జీవితంలో ఎక్కువ భాగం ఉద్యోగ కారణంగా ముంబై(Mumbai)లోనే ఉండేవాడు. ఇతని తల్లి చాలా పెద్దావిడ. సుమారు 25ఏళ్ళ పాటు కొడుకుతోనే ఉన్నారావిడ. కానీ ఆమె చివరి రోజులలో సొంత గ్రామానికి వెళ్ళిపోయింది. ఆమె అక్కడుండగానే ఆమెను చూసుకోవడానికి ఎవరూ లేక మరణించింది.
Read also: Viral Video: పాకిస్తాన్ కుకింగ్ షోలో ఈ మహిళ చేసిన పనికి అవాక్కైన జడ్జెస్.. అసలు విషయమేంటంటే..
తల్లి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయాడు ధనరాజ్ హజారే. తన తల్లిలా చివరి రోజుల్లో ఏ తల్లీ బాధపడకూడదని అనుకున్నాడు. ఈయన రిటైర్ అయినపుడు వచ్చిన 50లక్షలతో వృద్దుల కోసం ఏమైనా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. మొదట మహారాష్ట్రలోని పాల్ఘర్(Palghar) జిల్లాలో ఓ స్వచ్చంద సంస్థను(Social service Center) స్థాపించాలని అనుకున్నాడు. కానీ అక్కడ భూమి దొరకకపోవడంతో స్నేహితుల సహాయంతో ఔరంగాబాద్(Aurangabad) జిల్లా చికల్తానా(Chikalthana)లో స్థలం కొనుగోలు చేశాడు. 2020లో దీనికి సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇది ముగింపు దశకు చేరుకుంది. తొందరలోనే దీని ప్రారంభం ఉంటుందని తెలిపారు. ఇందులో మొత్తం ఆరు గదులు, హాల్, కిచెన్ ఉన్నాయట. ప్రారంభంలో 20మందికి వసతి కల్పించవచ్చని వీరు తెలిపారు. వృద్దుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి 24గంటల నర్సింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. వృద్దులను చూసుకోవడానికి నాలుగు జంటలను ఏర్పాటు చేశారు. వీరి పిల్లల చదువుకోసం కూడా ఆర్థిక సాయం అందించడానికి నెలనెలా 10వేల రూపాయలు అందించనున్నట్టు తెలిపారు. కాగా ధనరాజ్ హజారే భార్యా, పిల్లలు సహకారం అందించడం వల్లే ఇదిసాధ్యమైందని అన్నారు.