Viral Video: ఆ వేలికి మాత్రం ఉంగరాన్ని అస్సలు తొడక్కూడదట.. ఏ వేలికి ఉంగరం ధరించడం వల్ల ఏం జరుగుతుందంటే..!
ABN , First Publish Date - 2023-11-20T19:45:40+05:30 IST
చాలా మంది తమ చేతి వేళ్లకు ఉంగరాలను ధరించడాన్ని ఇష్టపడతారు. తమ ఆర్థిక పరిస్థితిని బట్టి బంగారం, వెండి మొదలైన లోహాలతో చేసిన ఉంగరాలను కొనుక్కుంటారు. బాగా ధనవంతులైతే అరుదైన వజ్రాలతో కూడిన ఉంగరాలను ధరిస్తుంటారు. అయితే చేతిలోని అన్ని వేళ్లకూ ఉంగరాలు ధరించకూడదట.
చాలా మంది తమ చేతి వేళ్లకు ఉంగరాలను (Rings) ధరించడాన్ని ఇష్టపడతారు. తమ ఆర్థిక పరిస్థితిని బట్టి బంగారం (Gold), వెండి (Silver) మొదలైన లోహాలతో చేసిన ఉంగరాలను కొనుక్కుంటారు. బాగా ధనవంతులైతే అరుదైన వజ్రాలతో కూడిన ఉంగరాలను (Diamond Rings) ధరిస్తుంటారు. అయితే చేతిలోని అన్ని వేళ్లకూ (Fingers) ఉంగరాలు ధరించకూడదట. ఆ విషయాన్ని తెలియజేస్తూ రూపొందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతోంది. digitalgandhi అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది.
వివిధ వేళ్లకు ఉంగరాలు ధరించడం వల్ల మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆ వైరల్ వీడియోలో వివరించారు. ఆ వీడియోలోని వ్యక్తి చెప్పిన దాని ప్రకారం.. చూపుడు వేలు బృహస్పతిని సూచిస్తుందని, ఆ వేలికి ఉంగరం ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. అలాగే మధ్య వేలు శనిని సూచిస్తుందని, దానికి ఉంగరం పెట్టుకోవడం వల్ల ఎక్కువ దృష్టి పడుతుందని అన్నారు. ఉంగరపు వేలు అపోలోను సూచిస్తుందని, దానికి ఉంగరం పెట్టుకుంటే ప్రేమ జీవితం బాగుంటుందని అన్నారు.
Viral Video: పునాదులు తవ్వుతోంటే బయటపడిన నంది విగ్రహం.. అనుమానంతో ఇంకాస్త లోతు తవ్వి చూస్తే..!
ఇక, చిటికెన వేలికి ఉంగరం పెట్టుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయని, బొటనవేలుపై ఉంగరాన్ని పెట్టుకుంటే ఇతరులతో బంధాలు మెరుగవుతాయని ఆ వీడియోలో పేర్కొన్నారు. మధ్య వేలికి తప్ప మిగతా అన్ని వేళ్లకూ ఉంగరం పెట్టుకోవచ్చిన ఆయన తెలిపారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 47 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.