Nihal Thomas: ప్రపంచంలో ఎంతమంది మధుమేహ బాధితులో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-07-01T11:38:33+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా 53 కోట్ల మంది మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారని వేలూరు సీఎంసీ డయాబెటీస్ విభాగం ప్రధాన స్పెషలిస్ట్
- సీఎంసీ వైద్యుడు నిహాల్ థామస్
వేలూరు(చెన్నై): ప్రపంచవ్యాప్తంగా 53 కోట్ల మంది మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారని వేలూరు సీఎంసీ డయాబెటీస్ విభాగం ప్రధాన స్పెషలిస్ట్ నిహాల్ థామస్(Nihal Thomas) తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రానున్న 25 సంవత్సరాల్లో మధుమేహ బాధితులు 130 కోట్లకు పెరిగే అవకాశముందన్నారు. చిన్నపిల్లలకు వచ్చే టైప్-1 షుగర్‌కు ఇన్సులిన్ తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. ఆహార పద్ధతి, జీవిత అలవాట్లు, వ్యాయామం చేయకుండా ఉండడం, ధూమపానం, కట్టెలో పొయ్యిలో వంట చేయడం ద్వారా ఏర్పడే పొగ, మత్తుమందులు, అధికంగా బియ్యం అన్నం తినడం సహా 14 కారణాలతో టైప్-2 మధుమేహం వస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పేద ప్రజలకు చిరుధాన్యాలు, రాగులు ఉచితంగా ఇస్తే, వారు వాటిని భుజించడం వల్ల మధుమేహం నుంచి తప్పించుకోవచ్చని డాక్టర్ నిహాల్ థామస్ తెలిపారు.