Viral News: ఆ రెండున్నర కోట్ల రూపాయలు ఎవరివి..? ఆ రెండక్షరాల పేరున్న వ్యక్తి ఎవరు..?
ABN , First Publish Date - 2023-05-03T16:49:24+05:30 IST
చాలా మంది జీవితంలో స్థిరపడాలంటే ఏదొక అదృష్టం కలిసిరావాలి రా? అంటుంటారు. ఇంకొందరైతే నుదిట మీద సుడి ఉండాలి రా? అంటుంటారు. ఇలా రకరకలైనా
చాలా మంది జీవితంలో స్థిరపడాలంటే ఏదొక అదృష్టం కలిసిరావాలి రా? అంటుంటారు. ఇంకొందరైతే నుదిట మీద సుడి ఉండాలి రా? అంటుంటారు. ఇలా రకరకలైనా మనుషులు అభిప్రాయాలు కలిగి ఉంటారు. కానీ కొంత మందికి అదృష్టం కలిసొచ్చినా అనుభవించే యోగం ఉండదు. ఇదంతా ఎందుకంటారా? ఈ వార్త చదివితే మీరే ఆశ్చర్యపోతారు.
కొంత మంది ఏదో సరదాగా లాటరీ టికెట్లు కొంటుంటారు. కొనడానికి కొంటారు గానీ.. ఆ తర్వాత దాని గురించి పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే లాటరీ తగులుతుందా? ఏంటి? అని లైట్ తీసుకుంటారు. అలానే ఓ వ్యక్తి టికెట్ అయితే కొన్నాడు గానీ.. కనీసం వివరాలు చెప్పకుండానే లాటరీ టికెట్ కొనుగోలు చేసి వెళ్లిపోయాడు. కానీ అదృష్టం అతని తలుపు తట్టింది. ఇప్పుడు వచ్చిన బహుమతిని అందుకునే మనిషే (No claimant) లేకపోయాడు.
పంజాబ్ (Punjab)లోని ఫాజిల్కా జిల్లాకు చెందిన ఓ సామాన్యుడు లాటరీలో రూ.2.50 కోట్ల (Rs 2.5 crore) లక్కీ డ్రా గెలుచుకొన్నాడు. అయితే ఇతడు చేసిన ఓ చిన్న పొరపాటు వల్ల ఇప్పుడు ఆ నగదు ( lottery amount ) బహుమతి ప్రభుత్వ ఖజానాకు వెళ్లేపోయే ప్రమాదం ఉంది.
లాటరీ టికెట్ కొన్న వ్యక్తి రెండక్షరాల పేరు మినహా తన చిరునామా, ఫోన్ నంబరు ఏదీ రాయలేదు. దీంతో వచ్చిన డబ్బును విజేతకు అందజేసేందుకు లాటరీ దుకాణ నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేవలం పేరు మాత్రమే రాస్తే గెలిచిన సొమ్మును పొందే అవకాశం ఉండదు. 249092 టికెట్ నంబరు కలిగిన వ్యక్తి తాను గెలుచుకున్న డబ్బు కోసం రూప్‌చంద్ లాటరీ కంపెనీని సంప్రదించాలని సంస్థ కోరింది. అతడు రాకపోతే మాత్రం అది నేరుగా ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుందని లాటరీ దుకాణదారు బాబీ జవేజా తెలిపారు.
ఇది కూడా చదవండి: Bride: కలలో కూడా ఊహించని ఘటన.. పెళ్లయిన 5 గంటలకే వధువు మృతి.. వరుడు పక్కన ఉండగానే..!