Share News

Afghanistan: అఫ్గాన్ క్రికెటర్ గొప్ప మనసు.. అర్ధరాత్రి అహ్మదాబాద్ రోడ్ల పైకి.. ఫుట్‌పాత్‌లపై నిద్రపోతున్న వారికి దీపావళి గిఫ్ట్స్!

ABN , First Publish Date - 2023-11-12T15:43:31+05:30 IST

ప్రస్తుత ప్రపంచకప్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన టీమ్ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా అఫ్గానిస్తాన్ టీమే. ఎలాంటి అంచనాలూ లేకుండా బరిలోకి దిగిన అఫ్గాన్ టీమ్.. తమ అద్భుత ఆటతీరుతో మేటి జట్లను సైతం భయపెట్టింది. సెమీస్‌కు చేరలేకపోయినా క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

Afghanistan: అఫ్గాన్ క్రికెటర్ గొప్ప మనసు.. అర్ధరాత్రి అహ్మదాబాద్ రోడ్ల పైకి.. ఫుట్‌పాత్‌లపై నిద్రపోతున్న వారికి దీపావళి గిఫ్ట్స్!

ప్రస్తుత ప్రపంచకప్‌లో (World Cup2023) అందరినీ ఆశ్చర్యపరిచిన టీమ్ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా అఫ్గానిస్తాన్ టీమే (Afghanistan). ఎలాంటి అంచనాలూ లేకుండా బరిలోకి దిగిన అఫ్గాన్ టీమ్.. తమ అద్భుత ఆటతీరుతో మేటి జట్లను సైతం భయపెట్టింది. సెమీస్‌కు చేరలేకపోయినా క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. టీమ్ ఇండియా తర్వాత ఈ ప్రపంచకప్‌లో మంచి ప్రతిభ కనబరిచిన జట్టుగా అఫ్గానిస్తాన్ నిలిచింది. బ్యాటర్ రెహ్మానుల్లా గుర్భాజ్ (Rahmanullah Gurbaz) చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.

మైదానంలో బ్యాట్‌తో అలరించిన గుర్భాజ్ మైదానం వెలుపల తన మంచి మనసుతో ఆకట్టుకున్నాడు. అహ్మదాబాద్ వీధుల్లోని ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న పేదలకు గుర్బాజ్ నిశ్శబ్దంగా సహాయం అందించాడు. రాత్రిపూట వీధిలో నిద్రిస్తున్న వారి ఒక్కొక్కరికీ రూ. 500 నోట్లు ఇవ్వడం వీడియోలో కనిపిస్తోంది (Diwali Gifts). కారులో వచ్చిన గుర్బాజ్ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న పేదలకు డబ్బులు అందించాడు. తను చేసిన సహాయం గురించి ఎలాంటి ప్రచారమూ చేసుకోలేదు. అయితే అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో (Viral Video) తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది.

Crime: ``నాన్నా.. నాకు యాక్సిడెంట్ అయింది.. కాపాడండి``.. అంటూ తండ్రికి కొడుకు ఫోన్.. తర్వాతి రోజు ఉదయానికి షాకింగ్ సీన్..

``పేదవాళ్లు కూడా దీపావళి సెలబ్రేట్ చేసుకునేందుకు సహాయం చేయాలని గుర్బాజ్ భావించి ధన సహాయం చేశాడు. భారత క్రికెటర్లు కూడా ఇలా చేస్తే బాగుంటుంది`` అని ఈ వీడియోను షేర్ చేసిన ట్విటర్ యూజర్ కామెంట్ చేశారు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 13 వేల మందికి పైగా వీక్షించారు. గుర్బాజ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ``తను అఫ్గానిస్తాన్ వెళ్లే ముందు గుర్బాజ్ ఇచ్చిన దీపావళి గిఫ్ట్``, ``చాలా గొప్ప మనసు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-11-12T15:43:33+05:30 IST