UPI Lite: గుడ్ న్యూస్.. ఇంటర్నెట్ లేకుండానే ఇకపై డబ్బులు పంపించొచ్చు.. కానీ ఒకే ఒక్క కండీషన్ ఏమిటంటే..!
ABN , First Publish Date - 2023-08-11T16:00:01+05:30 IST
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. యూపీఐ లైట్ లిమిట్‌ను పెంచింది. యూపీఐ లైట్ ద్వారా ఇదివరకు రూ.200 వరకు ట్రాన్సాక్షన్లను నిర్వహించే వీలుండేది. అయితే ఇప్పుడు ఈ లిమిట్‌ను రూ. 500కు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.
ఫోన్ పే (Phone pay), గూగుల్ పే (Google Pay), పేటీఎం (Paytm) వంటి యూపీఐ (UPI) వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది. యూపీఐ లైట్ లిమిట్ (UPI Lite Limit)ను పెంచింది. యూపీఐ లైట్ ద్వారా ఇదివరకు రూ.200 వరకు ట్రాన్సాక్షన్లను నిర్వహించే వీలుండేది. అయితే ఇప్పుడు ఈ లిమిట్‌ను రూ. 500కు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అంటే రూ.500 వరకు విలువైన ట్రాన్సాక్షన్లు ఒకేసారి యూపీఐ లైట్ ద్వారా నిర్వహించవచ్చు. యూపీఐ లైట్ ద్వారా పిన్ లేకుండానే ట్రాన్సాక్షన్లు పూర్తి చేయొచ్చు.
యూపీఐ లైట్ లిమిట్ పెంచాలనే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ (Shaktikanta Das) ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే యూపీఐ లైట్ వ్యాలెట్‌లో లోడ్ చేసుకునేందుకు ఉన్న రూ.2 వేల పరిమితిని మాత్రం పెంచలేదు. UPI లైట్ అనేది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లైట్ వెర్షన్. UPI ద్వారా ఎలాంటి చెల్లింపులు చేయాలన్నా ఇంటర్నెట్ అవసరం. కానీ UPI లైట్ ద్వారా వినియోగదారులు ఇంటర్నెట్ లేకుండా, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా రూ. 500 వరకు చెల్లించవచ్చు.
Cardiac Arrest: ఒకే కారణంతో 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి.. ఈ ఆహార పదార్థాలను కనుక రోజూ తినే అలవాటు ఉండి ఉంటే..!
UPI లైట్‌తో లావాదేవీలు నిర్వహించే వారు సైబర్ మోసాలు గురించి చింతించే పని ఉండదు. ఎందుకంటే లావాదేవీలు పరిమితికి మించి చేసే వీలుండదు కాబట్టి పెద్ద మొత్తంలో డబ్బులో కోల్పోయే ప్రమాదం ఉండదు. అలాగే ఇంటర్నెట్ లేదనే చింత కూడా అక్కర్లేదు. ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ లైట్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. అలాగే వినియోగదారులు ఎటువంటి రుసుము లేకుండా ఏ సమయంలోనైనా అదే బ్యాంక్ ఖాతాకు UPI బ్యాలెన్స్‌ని బదిలీ చేయవచ్చు.