Cigarettes: ఇక్కడ దేవుడికి సిగరెట్లే నైవేద్యం.. ఇలా చేస్తేనే కోరికలు తీరతాయని అపారమైన నమ్మకం..!
ABN , First Publish Date - 2023-03-08T16:07:12+05:30 IST
దేవాలయం... దీనికొక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అది ఏ గుడైనా సరే చాలా పవిత్రంగా భావిస్తుంటారు. ఇక భక్తులు కూడా అంతే క్రమశిక్షణగా నడుచుకుంటారు. సువాసనలు
దేవాలయం... దీనికొక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అది ఏ గుడైనా సరే చాలా పవిత్రంగా భావిస్తుంటారు. ఇక భక్తులు కూడా అంతే క్రమశిక్షణగా నడుచుకుంటారు. సువాసనలు వెదజల్లే అగరబత్తులు... కొబ్బరికాయలు.. పండ్లు.. ఫలహారాలు సమర్పిస్తుంటారు. ఇలా దేశంలోకి ఎక్కడికెళ్లినా ఇవే దృశ్యాలు కనిపిస్తుంటాయి. విచిత్రమేంటంటే ఆ గుడిలో మాత్రం సిగరెట్లు నైవేద్యంగా పెడతారట. ఓరి.. నాయనో ఇదెక్కడి ఆచారం అనుకుంటున్నారా? మీరు చదివింది కరెక్టే.. ఎక్కడో.. ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
గుజరాత్ రాష్ట్రం (Gujarat) సూరత్‌లోనున్న కటార్‌గ్రామ్‌లో ‘వంజరా భూత్‌మామ’ ఆలయం ఉంది. అయితే ఈ ఆలయానికొచ్చే భక్తులంతా అగరబత్తులు, కొబ్బరికాయలు, పండ్లు.. ఫలహారాలు కాకుండా సిగరెట్లు (Sigaretlu) తీసుకొచ్చి నైవేద్యంగా సమర్పించడం విశేషం. అలా చేస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని అక్కడి ప్రజల నమ్మకం. ఇలా కొన్నేళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. దీంతో సిగరెట్ల బిజినెస్ అమాంతంగా పెరిగింది. అంతేకాదు దుకాణాలు నిర్వహించే వ్యాపారస్తులు కూడా వివిధ రకాల బ్రాండ్‌లు తీసుకొచ్చి మరీ సిగరెట్లు విక్రయించడం విశేషం. ఇలా రోజుకు సగటున 100కు పైగా సిగరెట్ ప్యాకెట్ల విక్రయిస్తున్నారట. ఇక శనివారం.. ఇతర పండుగ రోజుల్లో అయితే రోజుకు 250 సిగరెట్ ప్యాకెట్లు అమ్ముడుపోతాయని అంటున్నారు. సిగరెట్ అమ్మకాలు ఒక్కసారిగా పెరగడంతో షాపులు కూడా ఒకదాని వెంబడి మరొకటి పుట్టుకొచ్చాయి.
ఇది కూడా చదవండి: Cheetah: రైలు ఇంజిన్‌పై చిరుత.. పడుకుందేమో అని అనుకున్నారు.. భయంభయంగానే వెళ్లి చూస్తే..
130 ఏళ్ల క్రితం వంజరుల సమూహం సూరత్ (Surat) ప్రాంతంలో నివసించేవారంట. ఆ సమయంలో ఒక వంజర మరణించాడు. అతని సమాధిని అక్కడే నిర్మించారు. అప్పటి నుంచి ఆ ప్రదేశాన్ని వంజరా భూత్‌మామ (Vanjara Bhootmama) అని పిలుస్తారు. అనంతరం కాలక్రమంగా వంజారా భూత్‌మామ ఆలయంగా ఏర్పాటైంది. దీంతో భక్తులు సిగరెట్లు వెలిగించి కొలవడం ప్రారంభించారు. సిగరెట్ వెలిగించి మొక్కుకుంటే ఆరోగ్యం (health), వివాహం (marriage), సంతానలేమి వంటి సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అంతేకాకుండా మగాస్ అనే మిఠాయిలు కూడా భూత్‌మామకు నైవేద్యంగా పెడుతుంటారు. ఇలా చేస్తే పనిలో ఏకాగ్రత ఉంటుందని ప్రజలు నమ్ముతారు. అలాగే మాగాస్ స్వీట్లు (Sweets) తమ దగ్గర పెట్టుకుంటే మంచి ఉద్యోగం కూడా వస్తుందని నమ్ముతారు.
ఇది కూడా చదవండి: Couple: కోర్టు మెట్లెక్కిన కొత్త పెళ్లి జంట.. మా ప్రాణాలతో వాళ్లు చెలగాటం ఆడారు.. రూ.40 కోట్ల నష్టపరిహారం ఇప్పించండంటూ..